Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SparkCat virus: స్మార్ట్ ఫోన్ లో డేటా చోరీ చేసే కొత్త వైరస్.. కలవరపడుతున్న యూజర్లు

స్మార్ట్ ఫోన్ వినియోగం నేడు సర్వసాధారమైంది. పిల్లల నుంచి పెద్దల వరకూ తమ అవసరాలను అనుగుణంగా దీన్ని వినియోగిస్తున్నారు. నిత్య జీవితంలో అనేక పనులను స్మార్ట్ ఫోన్ తో చాలా సులువుగా చేసుకోవచ్చు. దీని కోసం వివిధ రకాల యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోవాలి. అయితే ఇదే సమయంలో కొన్ని ప్రమాద కర యాప్ లు, వైరస్ లు పెరిగిపోతున్నాయి. వాటి వల్ల మన డేటా చోరీకి గురవుతుంది. అనేక ఆర్థిక నష్టాలకు గురయ్యే ప్రమాదం ఉంది.

SparkCat virus: స్మార్ట్ ఫోన్ లో డేటా చోరీ చేసే కొత్త వైరస్.. కలవరపడుతున్న యూజర్లు
Sparkcat Virus
Follow us
Srinu

|

Updated on: Feb 07, 2025 | 4:30 PM

ప్రస్తుతం స్పార్క్ క్యాట్ అనే ప్రమాదకర వైెరస్ స్మార్ట్ ఫోన్లలో చేరింది. దాదాపు 28 అప్లికేషన్లలో దీన్ని కనుగొన్నారు. స్టార్ ఫోన్ యూజర్లు ఇటీవల ఏవైనా అనుమానాస్పద యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటే వెంటనే తొలగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. స్పార్క్ క్యాట్ వైరస్ వల్ల మన వ్యక్తిగత, ఆర్థక పరమైన డేటాకు తీవ్ర ప్రమాదం కలుగుతుంది. ఈ ప్రమాదకర మాల్వేర్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ వ్యాప్తంగా వేలాది పరికరాలకు వ్యాపిస్తోంది. సాధారణ వైరస్ ల మాదిరిగా కాకుండా క్రిప్టో కరెన్సీ వాలెట్ రికవరీ పద బంధాలతో మన విలువైన డేటాను చోరీ చేస్తోంది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ లోని బహుళ యాప్ లలో కనిపించే ఒక హానికరమైన సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ కిట్ (ఎస్డీకే)నే స్పార్క్ క్యాట్ అనవచ్చు. వినియోగదారుల పరికరాల్లో నిల్వ చేసిన చిత్రాలను స్కాన్ చేయడం ద్వారా వ్యక్తిగత డేటాను దొంగిలిస్తుంది. ఈ మాల్వేర్ ఇన్ ఫెక్ట్ చేసిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే మీ ఆర్థిక, వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడుతుంది.

ఇప్పటి వరకూ అనేక యాప్ లు ఈ మాల్వేర్ బారిన పడినట్టు గుర్తించారు. వాటిలో 18 ఆండ్రాయిడ్ యాప్ లు, 10 ఐవోఎస్ యాప్ లు ఉన్నాయని నిర్దారించారు. ఇటువంటి యాప్ లలో చాట్ ఏఐ ఒకటి. దీనితో పాటు మరే ఇతర అనుమానాస్పద యాప్ లను డౌన్ లోడ్ చేసుకుని ఉంటే, మీ డేటాను రక్షించకోవడానికి వెంటనే అన్ ఇన్ స్టాల్ చేసి తొలగించండి. స్పార్క్ క్యాట్ వైరస్ మీ ఫోన్ లోని డేటాను దొంగిలిస్తుంది. ముందుగా ఫోన్ లోని ఫొటోలను స్కాన్ చేస్తుంది. క్రిప్టో కరెన్సీ వాలెట్ రికవరీ పద బంధాల కోసం వెతుకుతుంది. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నేషన్ (ఓసీఆర్) ఉపయోగించి గూగుల్ ఎమ్ఎల్ కిట్ ద్వారా చిత్రాల నుంచి వచనాన్ని చదువుతుంది. దీని ద్వారా సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం సాధ్యమవుతుంది. ఈ మాల్వేర్ చాలా ప్రమాదమైంది. ప్రపంచంలో అనేక భాషలను సులభంగా చదువుతుంది. ఇంగ్లిష్, హిందీ, చైనీస్, జపనీస్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషల్లో కీలక పదాలను గుర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

  • తెలియని యాప్ లను డౌన్ లోడ్ చేసుకోకూడదు. మంచి సమీక్షలు ఉన్న విశ్వసనీయ యాప్ లనే ఇన్ స్టాల్ చేసుకోవాలి.
  • ఏదైనా యాప్ మీ స్టోరేజ్ లేదా కెమెరాకు అవసరమైన యాక్సెస్ అడిగితే, వెంటనే నిరాకరించాలి. యాప్ అనుమతులను ఎప్పడూ తనిఖీ చేసుకోవాలి.
  • మీ సాఫ్ట్ వేర్ ను తాజాగా ఉంచుకోవాలి. రెగ్యులర్ అప్ డేట్ లు, భద్రతా లోపాలను పరిష్కరించుకోవాలని ఎంతో సహాయ పడుతుంది.
  • నమ్మకమైన యాంటీ వైరస్ ను వినియోగించాలి. మాల్వేర్ బెదిరింపులను గుర్తించి నిరోధించడానికి ఈ భద్రతా యాప్ లు ఉపయోగపడతాయి.
  • క్రిప్టో వాలెట్ పద బంధాలను స్క్రీన్ షాట్ లుగా ఎప్పుడు స్టోర్ చేసుకోవద్దు. వాటిని సురక్షితంగా పేపర్ మీద రాసుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి