Maruti Wagon R VXI: మార్కెట్‌లోకి వ్యాగన్ ఆర్ సరికొత్త వెర్షన్.. ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసా?
మారుతి వాహనాలు సరసమైన ధరల్లో లభించడమే కాక మంచి మైలేజీని ఇస్తాయి. దీంతో అవి భారతీయులను అమితంగా ఆకట్టుకున్నాయి. మారుతీ సుజుకీ కార్లల్లో ఎక్కువ ఆదరణ పొందిన మారుతి వ్యాగన్ ఆర్ సరికొత్త వెర్షన్ మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. మార్చి 2023లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లల్లో రెండో మోడల్‌గా ఈ కార్ ఉంది.

భారతదేశంలో మారుతి సుజుకి కార్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. సగటు మధ్యతరగతి వ్యక్తి బడ్జెట్‌కు సరిపోయే కార్లను విడుదల చేయడంలో ఈ కంపెనీకు మించినది మరొకటి లేదు. మారుతి వాహనాలు సరసమైన ధరల్లో లభించడమే కాక మంచి మైలేజీని ఇస్తాయి. దీంతో అవి భారతీయులను అమితంగా ఆకట్టుకున్నాయి. మారుతీ సుజుకీ కార్లల్లో ఎక్కువ ఆదరణ పొందిన మారుతి వ్యాగన్ ఆర్ సరికొత్త వెర్షన్ మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. మార్చి 2023లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లల్లో రెండో మోడల్‌గా ఈ కార్ ఉంది. విక్రయాల పరంగా ఇది మారుతి స్విఫ్ట్ తర్వాత ఈ కార్ అధిక అమ్మకాలను నమోదు చేసింది. ముఖ్యంగా వ్యాగన్ ఆర్‌లో వీఎక్స్ఐ వేరియంట్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ కార్‌లో అధునాతన ఫీచర్లు ఉండడంతో పాటు తక్కువ ధరకు లభిస్తుండడంతో వినియోగదారుల ఆదరణ పొందింది. వ్యాగన్ ఆర్ వీఎక్స్ఐ కార్ గురించి ఇతర ఫీచర్లు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
ధర, ఇంజిన్, మైలేజ్
వీఎక్స్ఐ అనే వ్యాగన్ ఆర్ రెండో బేస్ మోడల్. ఈ కార్ ధర రూ5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) అలాగే ఈ కార్ ఆన్ రోడ్ ధర దాదాపు రూ. 7.7 లక్షలుగా ఉంటుంది. సిల్కీ సిల్వర్, పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్, మాగ్మా గ్రే, సాలిడ్ వైట్, పూల్‌సైడ్ బ్లూ వంటి అనేక రంగుల్లో ఈ వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ 998 సీసీ ఇంజిన్‌తో మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 998 సీసీ ఇంజిన్ 89 ఎన్ఎం టార్క్, 65.71 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వీఎక్స్ఐ మోడల్‌ను సీఎన్‌జీ ఎంపికతో కూడా ఆర్డర్ చేయవచ్చు. ఈ కార్ లీటర్‌కు 33 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
వ్యాగన్ ఆర్ వీఎక్స్ఐ ఫీచర్లు ఇదే
మారుతి వ్యాగన్ఆర్ వీఎక్స్ఐ కారులో ఐదుగురు ప్రయాణించవచ్చు. మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్-అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎంలు, టచ్ స్క్రీన్, యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్, ఫాగ్ లైట్లు, ఫ్రంట్, రియర్ పవర్ విండోస్, రియర్ వీల్ కవర్, రెండు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు వ్యాగన్ ఆర్ కారులో అందుబాటులో ఉన్నాయి. అలాగే మారుతి వ్యాగన్ఆర్ వీఎక్స్‌ఐ టాటా పంచ్ ప్యూర్, మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ కార్లకు మంచి పోటీనిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







