Gas Cylinder Rules: గ్యాస్ సిలిండర్లు వాడేవారికి కేంద్రం కొత్త రూల్స్.. 30 రోజులు మాత్రమే టైమ్..

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వాడేవారికి కేంద్రం కొత్త రూల్స్ విధించింది. గతంలో ఉన్న నిబంధనలను సవరించింది. దీంతో గ్యాస్ వినియోగదారులకు మరింత ఊరట కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా గ్యాస్ సిలిండర్ల ధరలను కేంద్రం పెంచింది. ఈ క్రమంలో కొత్త రూల్స్ ఏంటో చూద్దాం.

Gas Cylinder Rules: గ్యాస్ సిలిండర్లు వాడేవారికి కేంద్రం కొత్త రూల్స్.. 30 రోజులు మాత్రమే టైమ్..
Lpg Gas Cylinder

Updated on: Jun 08, 2026 | 4:12 PM

మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా..? అయితే మీకో అలర్ట్. కేంద్ర ప్రభుత్వం పలు కొత్త నిబంధనలను తాజాగా అమల్లోకి తెచ్చింది. మీరు ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వాడుతుంటే.. కొత్త రూల్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. పైప్డ్ నేచురల్ గ్యా్స్(PNG) కనెక్షన్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు తప్పనిసరిగా పీఎన్జీలోకి మారాలని, ఎల్పీజీ కనెక్షన్‌ను వదలుకోవాలని గతంలో కేంద్రం కండీషన్ విధించింది. గ్యాస్ ఏజెన్సీలు అలాంటివారి కనెక్షన్లను రద్దు చేయాలని కూడా సూచించింది. కొంతమంది పీఎన్జీతో పాటు ఎల్పీజీ సిలిండర్ల కనెక్షన్లు కూడా కలిగి ఉన్నారు. వీరి కనెక్షన్లను వెంటనే రద్దు చేయాలని ఆదేశించింది. ఇప్పుడు ఆ రూల్స్‌లో కేంద్రం పలు సండలింపులు ఇచ్చింది. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం.

30 రోజుల డెడ్ లైన్

మారిన సవరణల ప్రకారం.. మీరు ఒకవేళ ఎల్పీజీ కనెక్షన్ కలిగి ఉండి కొత్తగా పీఎన్జీ కనెక్షన్ తీసుకుంటే 30 రోజుల గడువు ఉంటుంది. 30 రోజుల్లోగా ఎల్పీజీ కనెక్షన్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఆ తర్వాత మళ్లీ పీఎన్‌జీ సదుపాయాలు అందుబాటులో లేని ఏరియాలోకి మారినప్పుడు ట్రాన్స్‌ఫర్ వొచర్ ఇస్తారు. దీని ద్వారా మీరు వెంటనే ఎల్పీజీ కనెక్షన్ పొందవచ్చు. ఈ మేరకు కొత్త నిబంధనలను కేంద్రం తీసుకొచ్చింది.

పీఎన్‌జీ కనెక్షన్ వల్ల లాభాలు..?

-ఎల్పీజీ సిలిండర్ పదే పదే రీఫిల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డెలివరీ కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఇంటి దగ్గర లేకపోతే ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా గ్యాస్ డెలివరీకి వారం రోజుల సమయం పడుతుంది. కానీ పీఎన్‌జీ కనెక్షన్ తీసుకోవడం వల్ల అలాంటి ఇబ్బంది ఉండదు. నిరంతరం గ్యాస్ అందుబాటులో ఉంటుంది

-ఇక ఎల్పీజీ సిలిండర్లలో గ్యాస్ నిండుగా నింపారా లేదా అనే అనుమానం ఉంటుంది. చెక్ చేసుకోవడం అనేది శ్రమతో కూడుకున్న పని. అదే పీఎన్‌జీలో ఆ సమస్య ఉండదు

-ఇక పీఎన్‌జీ కనెక్షన్ తీసుకుంటే ముందుగానే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మీటర్ ప్రకారం బిల్లింగ్ జరుగుతుంది. అంటే మీరు వాడుకున్న గ్యాస్‌కు అనుగుణంగా బిల్ వేస్తారు. దీని వల్ల గ్యాస్ దొంగతనానికి ఆస్కారం అనేది ఉండదు. ప్రతీ రెండు నెలలకు ఒకసారి డబ్బులు చెల్లించే సౌకర్యం ఉంది.

-ఇక పీఎన్‌జీ వాడితే మసి, బూడిద, జిడ్డు మరకలు వంటి సమస్యలు కూడా ఉండవు. అలాగే పీఎన్జీ అనేది అత్యంత సురక్షితమైనది. లీకేజీ జరిగినప్పుడు పెద్దగా ప్రమాదం ఉండదు. వెంటిలేషన్ ఉంటే పలుచటి గాలిలో కలిసిపోతుంది. అదే ఎల్పీజీ బరువుగా ఉండటం వల్ల నేత ఉపరితలం వద్ద పేరుకుపోతుంది.

 

Follow Us