Electric Bike: స్పోర్టీ లుక్‌తో ఆకర్షిస్తున్న నయా ఈవీ బైక్..ధర ఎంతో తెలిస్తే షాక్..!
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా చాలా దేశాలు పర్యావరణ పరిరక్షణతో క్రూడ్ ఆయిల్ దిగుమతులను పరిమితం చేసుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై అనేక సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి. అయినా దేశంలో ఈవీ స్కూటర్లు ప్రాచుర్యం పొందినంత వేగంగా ఈవీ బైక్స్ ప్రాచుర్యంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో స్పోర్టీ లుక్‌తో కొత్త ఈవీ బైక్ మార్కెట్‌ను షేక్ చేస్తుంది.

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ బైక్‌లు ధర అనేది సామాన్యులకు దూరంగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్ల ధరల స్థాయిలోనే కొన్ని కంపెనీలు ఈవీ బైక్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఒడిస్సీ కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీ బైక్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఒడిస్సీ ఈవీ బైక్ మంచి స్పోర్టీ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఒడిస్సీ కంపెనీ దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌గా పేరు పొందిన ఎవోకిస్ లైట్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర కేవలం రూ.1,18,000గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు 60 వాట్స్ బ్యాటరీతో ఆకట్టుకుంటుంది.
ఒడిస్సీ ఎవోకిస్ లైట్ ఈవీ బైక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కి.మీ.లు మైలేజ్ అందిస్తుంది. అలాగే ఎవోకిస్ లైట్ గంటకు 75 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఒడిస్సీ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు నెమిన్ వోరా మాట్లాడుతూ స్పోర్టి రైడ్‌లను గతంలో కంటే మరింత అందుబాటులోకి తెవడమే లక్ష్యంగా ఈ ఈవీ బైక్‌ను రిలీజ్ చేశామని పేర్కొన్నారు. ఈ బైక్ పనితీరుతో పాటు సరసమైన ధరలకు సంబంధించి కచ్చితమైన కలయికగా ఉంటుంది.
ఎవోకిస్ లైట్ అధునాతన లక్షణాలతో ఆకట్టుకుంటుంది. కీలెస్ ఇగ్నిషన్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్‌లు, మోటార్ కట్-ఆఫ్ స్విచ్, యాంటీ-థెఫ్ట్ లాక్, స్మార్ట్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ బైక్‌ను మరింత ఆకర్షించేలా చేస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ కోబాల్ట్ బ్లూ, ఫైర్ రెడ్, లైమ్ గ్రీన్, మాగ్నా వైట్ మరియు బ్లాక్ వంటి ఐదు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




