Bajaj Chetak Electric Scooter: బజాజ్ చేతక్ వెక్టార్.. కంపెనీ నుంచి రానున్న మూడో ఈ-స్కూటర్ ఇదేనా?
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు బజాజ్ ఓ కొత్త పేరు ట్రేడ్ మార్క్ చేసింది. వెక్టార్ పేరుతో ట్రేడ్ మార్క్ కు ఫైల్ చేసింది. ఈ పేరు త్వరలో లాంచ్ కానున్న చేతక్ బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించనదే అని అందరూ భావిస్తున్నారు. 2020లో ఈ టూ వీలర్ మేకర్ చేతక్ బ్రాండ్ ను రీలాంచ్ చేసింది. కేవలం ఎలక్ట్రిక్ వేరియంట్లోనే ఉత్పత్తులకే దీనిని పరిమితం చేసింది.

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు బజాజ్ ఓ కొత్త పేరు ట్రేడ్ మార్క్ చేసింది. వెక్టార్ పేరుతో ట్రేడ్ మార్క్ కు ఫైల్ చేసింది. ఈ పేరు త్వరలో లాంచ్ కానున్నబజాజ్ చేతక్ బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించనదే అని అందరూ భావిస్తున్నారు. 2020లో ఈ టూ వీలర్ మేకర్ చేతక్ బ్రాండ్ ను రీలాంచ్ చేసింది. కేవలం ఎలక్ట్రిక్ వేరియంట్లోనే ఉత్పత్తులకే దీనిని పరిమితం చేసింది. ఇప్పటికే ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో దీని నుంచి రానున్న కొత్త స్కూటర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓ కొత్తపేరు బజాజ్ ట్రేడ్ మార్క్ చేయడంతో అందరూ చేతక్ టెక్నాలజీస్ బ్రాండ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసమే చేశారని భావిస్తున్నారు.
వెక్టార్ అంతకుముందే..
గత కొన్ని సంవత్సరాల క్రితం స్వీడిష్ తయారీదారైన హస్క్వర్నా వెక్టార్(Vektorr)ఈవీ కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. ఈ స్కూటర్ కు మన భారతీయ రోడ్లపై సైతం పలు పరీక్షలు నిర్వహించింది. చేతక్ ఈ స్కూటర్లతో పాటు ఈ వెక్టర్ స్కూటర్లు కూడా కనిపించేవి. అంతేకాక కేటీఎం ఏజీ సంస్థలో 48శాతం స్టేక్ హోల్డింగ్స్ ను బజాజ్ సంస్థ కలిగి ఉంది. ఈ కేటీఎం కంపెనీకు మాతృ సంస్థే ఈ హస్క్వర్నా. ఈ నేపథ్యంలో ఈ వెక్టర్ పేరునే ఇప్పుడు బజాబ్ ట్రేడ్ మార్క్ చేయడంతో అందరూ దీనిపై దృష్టి పెడుతున్నారు. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ కోసమే అని అంచనా వేస్తున్నారు. హస్క్వర్నా వెక్టార్ కు అప్ గ్రేడెడ్ వెర్షన్లో ఇది వచ్చే అవకాశం ఉందని, చేతక్ బ్రాండ్ దీనిని తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
బజాజ్ చేతక్ నుంచి రెండు వేరియంట్లు..
ప్రస్తుతం మన దేశంలో బజాజ్ చేతక్ నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. చేతక్ ప్రీమియం, చేతక్ అర్బేన్. వీటిల్లో చేతక్ ప్రీమియం కొంత కాలం క్రితమే లాంచ్ అవగా.. ఇటీవల చేతక్ అర్బేన్ కూడా మార్కెట్లోకి వచ్చింది. రెండు మోడల్‌లు ఒకేలా ఉన్నప్పటికీ, అర్బేన్ ‘టెక్‌పాక్’ని అందిస్తోంది. ఇది హిల్ హోల్డ్, రివర్స్ మోడ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ట్యాంపర్ అలర్ట్‌ల వంటి అత్యాధునిక ఫీచర్లను అందిస్తోంది. అంతేకాకుండా ఇది అధిక టాప్ స్పీడ్ ను కూడా అందిస్తుంది. బేస్ -స్పెక్ వేరియంట్ గరిష్టంగా గంటకు 63 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా.. చేతక్ అర్బేన్ మరో 10 కిలోమీటర్ల అధిక వేగంతో ప్రయాణిస్తుంది. చేతక్ ప్రీమియం ధర రూ. 1.20 లక్షల ఎక్స్-షోరూమ్, అర్బేన్ ధర రూ. 1.15 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. కొత్త సంవత్సరంలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయనున్నట్లు బజాజ్ చేతక్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో త్వరలో రానున్న ఈ స్కూటర్ కే ఈ వెక్టార్ పేరును ఫైనల్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..