Upcoming Electric Scooters: కొత్త సంవత్సరంలో లాంచింగ్ రెడీ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
కొత్త సంవత్సరంలో పెద్ద ఎత్తున కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు కంపెనీలు సమాయత్తమవుతున్నాయి. 2023లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల సేల్స్ 8.3లక్షల మార్క్ ను చేరింది. ఈ సంఖ్య 2024లో మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా కొత్త సంవత్సరంలో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ కథనం మీ కోసమే. ప్రముఖ ఎలక్ట్రిక్ బ్రాండ్లు అయిన ఏథర్ నుంచి ఓలా వరకూ 2024లో మార్కెట్లోకి రానున్నాయి.

2023వ సంవత్సరం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఓ సవాలులా నడిచింది. ఎందుకంటే వినియోగదదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటం, మరోవైపు ప్రభుత్వం ఫేమ్ 2 సబ్సిడీ విషయంలో తీసుకున్న కొత్త నిర్ణయాలు కంపెనీలకు ఇబ్బందులను కలుగజేశాయి. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది. అయినప్పటికీ ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ప్రజల నుంచి మంచి డిమాండ్ ఉండటంతో కంపెనీలు సబ్సీడీ తగ్గినా ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ వచ్చాయి. ఈ క్రమంలో కొత్త సంవత్సరంలో పెద్ద ఎత్తున కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు కంపెనీలు సమాయత్తమవుతున్నాయి. 2023లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల సేల్స్ 8.3లక్షల మార్క్ ను చేరింది. ఈ సంఖ్య 2024లో మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా కొత్త సంవత్సరంలో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ కథనం మీ కోసమే. ప్రముఖ ఎలక్ట్రిక్ బ్రాండ్లు అయిన ఏథర్ నుంచి ఓలా వరకూ 2024లో మార్కెట్లోకి రానున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఏథర్ 450 ఎపెక్స్..
కొత్త సంవత్సరంలో ఏథర్ నుంచి 450ఎపెక్స్ స్కూటర్ మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ జనవరి ఆరో తేదీన లాంచ్ కానుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 450ఎక్స్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. దీనికి సంబంధించిన టీజర్లో 450ఎక్స్ సిరీస్ 1 లిమిటెడ్ ఎడిషన్ మాదిరి ట్రాన్స్ పరెంట్ సైడ్ ప్యానల్స్ తో ఉంటుంది. ఇది దీని లుక్ ను మరింత క్రేజీగా మార్చేస్తోంది.
యాంపియర్ ఎన్ఎక్స్‌జీ..
గ్రీవ్స్ కాటన్ కు చెందిన యాంపియర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎన్ఎక్స్‌జీ మార్కెట్లోకి రానుంది. 2023లో నిర్వహించిన ఆటో ఎక్స్ పో లో ఈ మోడల్ ను ప్రదర్శించింది. దీనిలో ఏడు అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్, పీఎంఎస్ మిడ్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్, ఫీచర్లు ఉంటాయి. ఇది ఏథర్ 450ఎక్స్, ఓలా ఎస్1 ప్రో, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా మార్కెట్లోకి రానుంది.
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ..
మన దేశ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లో టీవీఎస్ ఐక్యూబ్ ఒకటి. ఈ క్రమంలో టీవీఎస్ నుంచి ఐక్యూబ్ ఎస్టీ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకురానుంది. దీనిలో టాప్ స్పెక్స్ ఉన్నాయి. 4.56కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 145కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో ఎకో మోడ్, పవర్ మోడ్ లు అందుబాటులో ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.
2024 బజాజ్ చేతక్ ప్రీమియం..
2024 బజాజ్ చేతక్ అర్బేన్ ఇటీవల లాంచ్ అయ్యింది. అయితే దీనికి మరింత హంగులు జోడించి ప్రీమియం లుక్లో బజాజ్ చేతక్ ప్రీమియం స్కూటర్ను లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో 3.2 కేడబ్ల్యూహెచ్ ఫిక్స్ డ్ బ్యాటరీ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 126కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్స్ ఉంటాయి. ఇది గరిష్టంగ 73కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.
ఏథర్ ఫ్యామిలీ స్కూటర్..
ఏథర్ ఎనర్జీ నుంచి కొత్త సంవత్సరంలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫ్యామిలీ సెక్షన్ కోసం దీనిని తీసుకొస్తోంది. ఇది 2024లో షోరూంలో దర్శనిమివ్వనుంది. ఏథర్ ఫ్యామిలీ స్కూటర్ పేరుతో దీనిని లాంచ్ చేయనుంది. అనువైన బడ్జెట్లోనే దీనిని తీసుకురానుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..