Diabetes Medicine: షుగర్ పేషెంట్స్‌కు స్వీట్ న్యూస్.. మందుల ధరలను భారీగా తగ్గించిన ఔషధ ధరల నియంత్రణ సంస్థ..
Diabetes Medicine: డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారా.? ఎప్పటి నుంచో మందులను వాడుతున్నారా.? భారీగా పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నారా.? అయితే మీకోసమే జాతీయ ఔషధ ధర నియంత్ర సంస్థ (NPPA) శుభవార్త తెలిపింది. షుగర్‌తో పాటు...
Diabetes Medicine: డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారా.? ఎప్పటి నుంచో మందులను వాడుతున్నారా.? భారీగా పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నారా.? అయితే మీకోసమే జాతీయ ఔషధ ధర నియంత్ర సంస్థ (NPPA) శుభవార్త తెలిపింది. షుగర్‌తో పాటు ఇతర చికిత్సలకు ఉపయోగించే మొత్తం 45 రకాల మందుల ఎమ్‌ఆర్‌పీ ధరలను ధరల నియంత్రణ సంస్థ తాజాగా సవరించింది. దీంతో ఈ ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ధరలు తగ్గిన మందుల జాబితాలో డయాబెటిస్‌తోపాటు జలుబు, కాలెస్ట్రాల్, నొప్పి నివారణ, జీర్ణాశయ సమస్యలకు ఉపయోగించేవి సైతం ఉన్నాయి.
షుగర్ వ్యాధితో బాధపడుతోన్న వారు ఉపయోగించే సిటాగ్లిప్టిన్ + మెట్‌ఫామిన్, లినాగ్లిప్టిన్ + మెట్‌పామిన్ కాంబినేషన్ డ్రగ్స్ ధరలు తగ్గనున్నాయి. ఈ ఔషధాలపై మెర్క్‌షార్ప్ అండ్ డోమ్‌కు ఉన్న పేటెంట్ హక్కుల కాల పరిమితి గత నెలతో ముగిసింది. దీంతో మార్కెట్లోకి ఇతర రకాల సిటాగ్లిస్టిన్ జనరిక్ మందులు అందుబాటులోకి వచ్చాయి. పేటెంట్ హక్కుల పరిమితి ముగిసన నేపథ్యంలో తగ్గిన ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించేందుకే NPPA ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు 15 ట్యాబ్లెట్లు ఉండే సిటాగ్లిప్టిన్+మెట్‌ఫామిక్ ప్యాకెట్ ధర రూ. 345 ఉండగా.. కొత్తగా సవరించిన ధరలతో ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 16 నుంచి 21 మధ్యకు చేరింది. ఇక లినాగ్లిప్టిన్ + మెట్‌పామిన్ ధరలను కూడా ఔషధ నియంత్రణ సంస్థ నియత్రించింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 16 నుంచి 25గా నిర్ణయించగా, 2.5 ఎంజీ ట్యాబ్లెట్ ధరను రూ. 16.17, 5 ఎంజీ ట్యాబ్లెట్ ధర రూ. 25.33గా నిర్ణయించారు.
వీటితో పాటు అలర్జీ, జలుబుకు వాడే పారాసిటమాల్, ఫినైల్‌ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్, కెఫైన్ అండ్ డిఫెన్‌హైడ్రామైన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్ ట్యాబ్లెట్ ధరను రూ. 3.73గా, అలాగే యాంటిబయోటిక్‌గా ఉపయోగించే అమోక్సిసిలిన్, పొటాషియం క్లావులనేట్ కాంబినేషన్‌తో వచ్చే సిపర్ ధరను రూ. 168.43గా నిర్ణయించారు.
మరిన్ని బిజినెస్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..