Reliance Jio Sound Box: యూపీఐ పేమెంట్స్‌ రంగంలోకి రిలయన్స్‌ ఎంట్రీ.. జియో పేమెంట్‌ బాక్స్‌ పేరుతో..

రిలయన్స్‌ ఇకపై కొత్త రూపంలో కూడా జనాలకు కనెక్ట్‌ కాబోతోంది. పేమెంట్స్‌ రంగంలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు అంతా సిద్ధమైంది. రిలయన్స్‌ జియో పేమెంట్స్‌ సౌండ్‌బాక్స్‌ పేరుతో సరికొత్తగా మార్కెట్లోకి రానుంది. దీనిని ఇప్పటికే పలు ప్రాంతాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా రిలయన్స్‌ పరీక్షించి విజవంతమైంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, నగరాల్లో దీనిని ఆవిష్కరించాలని ఏర్పాట్లు చేస్తోంది.

Reliance Jio Sound Box: యూపీఐ పేమెంట్స్‌ రంగంలోకి రిలయన్స్‌ ఎంట్రీ.. జియో పేమెంట్‌ బాక్స్‌ పేరుతో..
Reliance Jio Sound Box
Follow us

|

Updated on: Mar 13, 2024 | 9:23 AM

రిలయన్స్‌ జియో.. దేశంలోనే ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఉచితంగా హై స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ అంటూ వచ్చి వేగంగా జనాల్లోకి చొచ్చుకుపోయిన సంస్థ అది. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్‌ అంబానీకి చెందిన సంస్థ అది. ఈయన ఆరంభించిన జియో సేవలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తృతంగా అందుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆయన ప్రణాళిక చేశారు. ఇప్పటికే టెలికాం రంగంతో పాటు రిటైల్‌, వస్త్రాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి ప్రధాన రంగాల్లో దూసుకెళ్తున్న రిలయన్స్‌ ఇకపై కొత్త రూపంలో కూడా జనాలకు కనెక్ట్‌ కాబోతోంది. పేమెంట్స్‌ రంగంలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు అంతా సిద్ధమైంది. రిలయన్స్‌ జియో పేమెంట్స్‌ సౌండ్‌బాక్స్‌ పేరుతో సరికొత్తగా మార్కెట్లోకి రానుంది. దీనిని ఇప్పటికే పలు ప్రాంతాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా రిలయన్స్‌ పరీక్షించి విజవంతమైంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, నగరాల్లో దీనిని ఆవిష్కరించాలని ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం పేటీఎం సేవలపై ఆంక్షల నేపథ్యంలో రిలయన్స్‌ వేగంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి ప్లాట్‌ ఫారంల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

జియో పే యాప్‌ సాయంతో..

రిలయన్స్‌ జియో పే ద్వారా ఈ కొత్త జియో పేమెంట్స్‌ సౌండ్‌ బాక్స్‌ పని చేయనుంది. ఆర్బీఐ పేటీఎంపై తీసుకున్న చర్యల నేపథ్యంలో దీని రాక ప్రాధాన్యం సంతరించుకుంది. మార్చి 15 వరకూ పేటీఎం సేవలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత పరిస్థితిని ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. అయితే పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ వర్మ మార్చి 15 తర్వాత కూడా క్యూఆర్‌ కోడ్‌ సాయంతో చెల్లింపులు, సౌండ్‌ బాక్స్‌ సేవలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు.

వ్యాపారులకు ప్రత్యేక టారిఫ్‌..

రిలయన్స్‌ జియో పేమెంట్స్‌ సౌండ్‌ బాక్స్‌ కొనుగోలు చేసే వ్యాపారులకు ప్రత్యేక టారిఫ్‌ ఉంటుంది. అంతేకాక నెలవారీ కొంత అద్దె కూడా చెల్లించాల్సి ఉంటుంది. క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత లావాదేవీలు ఫిన్‌టెక్‌ కంపెనీలకు పీఓఎస్‌ లేదా పాయింట్‌ ఆఫసేల్స్‌ డివైజ్‌ల కంటే ఇది రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అంతేకాక వ్యాపారులకు వారి లావాదేవీల ఆధారంగా రుణ సౌకర్యాలు కూడా దీని సాయంతో అందుబాటులో ఉంటాయి. దేశ వ్యాప్తంగా ఈ యూపీఐ ఆధారిత సౌండ్‌ బాక్స్‌లు 2 కోట్ల మంది వ్యాపారులు వినియోగిస్తున్నారు. ఈ విభాగంలో ప్రస్తుతం పేటీఎం నంబర్‌ వన్‌ స్థానంలో ఉండగా ఫోన్‌ పే తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు రిలయన్స్‌ రాకతో స్థానాల్లో మార్పు కనిపించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..