AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: ముఖేష్ అంబానీ కూడా టాప్ 10 సంపన్నుల జాబితా నుంచి తొలగనున్నారా..?

ఇటీవలి కాలంలో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో వేగంగా మార్పు వచ్చింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రస్తుత జాబితాను పరిశీలిస్తే.. ప్రపంచంలోని టాప్-10 సంపన్నుల..

Mukesh Ambani: ముఖేష్ అంబానీ కూడా టాప్ 10 సంపన్నుల జాబితా నుంచి తొలగనున్నారా..?
Mukesh Ambani
Subhash Goud
|

Updated on: Feb 26, 2023 | 5:06 PM

Share

ఇటీవలి కాలంలో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో వేగంగా మార్పు వచ్చింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రస్తుత జాబితాను పరిశీలిస్తే.. ప్రపంచంలోని టాప్-10 సంపన్నుల జాబితాలో ఒక భారతీయుడు మాత్రమే ఉన్నారు. ఆయనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ. అదే సమయంలో అంబానీ కూడా ఈ జాబితాలో టాప్-10 నుండి బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బ్లూమ్‌బెర్గ్ జాబితా ప్రకారం.. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 81.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మొదటి రెండు నెలల్లో అతని నికర విలువలో సుమారు $ 5.38 బిలియన్ల క్షీణత కనిపించడం గమనార్హం. అదే సమయంలో అతని తర్వాత బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 11వ స్థానంలో ఉన్న సెర్గీ బ్రిన్ సంపద ప్రస్తుతం 80.7 బిలియన్ డాలర్లుగా ఉంది. గత రెండు నెలల్లో ఆయన సంపద 1.31 బిలియన్ డాలర్లు పెరిగింది. అతను ఎప్పుడైనా ఇండెక్స్‌లో భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీని అధిగమించగలడు.

గౌతమ్ అదానీ వేగంగా దిగి వచ్చాడు:

మరోవైపు ఇంతకుముందు జాబితాలో టాప్-3లో నిలిచిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపదలో అతిపెద్ద క్షీణత కనిపించింది. అతను ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 30వ స్థానానికి చేరుకున్నాడు. సంవత్సరం ప్రారంభం నుండి మొదటి రెండు నెలల్లో అతని సంపద $80.6 బిలియన్లు క్షీణించింది. దీనికి కారణం అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు.

ఇవి కూడా చదవండి

జనవరి 24న వచ్చిన హిండెన్‌బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేసిందని, అకౌంటింగ్‌కు సంబంధించిన మోసానికి పాల్పడిందని ఆరోపించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు పతనమయ్యాయి. ఇప్పుడు ఈ నివేదిక వచ్చి నెల రోజులైంది. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 12 లక్షల కోట్ల మేర తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. కాగా, ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ట్విట్టర్ చీఫ్ ఎలోన్ మస్క్ తర్వాతి స్థానంలో ఉన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి