Metal: బంగారం, వెండికి పోటీగా పెరుగుతున్న మరో లోహం.. రాబోయే రోజుల్లో మరింత డిమాండ్.. ఇదే సరైన సమయం
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత నెలలో భారీగా పెరగ్గా.. ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అయితే త్వరలో పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో బంగారం ధరలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బంగారం, వెండికి పోటీగా మరో లోహానికి డిమాండ్ పెరుగుతోంది.

బంగారం, వెండి ధరలు మొన్నటివరకు భారీగా పెరగ్గా… ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గత నెలలో పసిడి ధరలు జీవితకాలపు గరిష్ట స్థాయిని నమెదు చేశాయి. తులం బంగారం ఏకంగా రూ.1.90 లక్షల వరకు చేరుకోగా.. కేజీ వెండి రూ.4 లక్షల మార్క్‌ను అధిగమించింది. ఆ తర్వాత అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ జరగడం, డాలర్ బలపడటంతో ధరలు పడిపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం గత కొద్ది రోజులుగా గోల్డ్, సిల్వర్ ధరలు స్ధిరంగా కొనసాగుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయంగా కాస్త సానుకూల పరిస్థితులు నెలకొడంతో స్టాక్ మార్కెట్లు పాజిటివ్ సంకేతాల దిశగా వెళ్తున్నాయి. పసడి ధరలు తగ్గడానికి ఇదొక కారణంగా చెప్పవచ్చు.
పోటీ ఇస్తున్న కాపర్
బంగారం, వెండికి కాపర్ గట్టి పోటీ ఇస్తోంది. రాగి ధరలు గత ఏడాదిగా భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. 2025లో సిల్వర్ ధరలు 150 శాతం పెరగ్గా.. కాపర్ 32 శాతం పెరిగింది. ప్రస్తుతం రాగికి పారిశ్రామికంగా డిమాండ్ ఉన్న క్రమంలో ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, మోటార్లు, వైర్ల, విండ్ టర్బైన్ల తయారీలో కాపర్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో డేటా సెంటర్లు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయాల్సి వస్తోంది. దీని వల్ల కాపర్‌కు డిమాండ్ ఉన్న కారణంగా ధరలు పెరుగతున్నాయని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. ఇక పవర్ కేబుల్స్, జీపీయూ, ట్రాన్స్‌ఫార్మర్లలో రాగిని ఎక్కువగా వాడుతూ ఉంటారు.
భవిష్యత్తులో విలువైన లోహంగా కాపర్
భవిష్యత్తులో కాపర్ కూడా బంగారం, వెండిలాగా విలువైన లోహంగా మారే అవకాశముందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాగి ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ధరలు పెరగడానికి ఇదొక కారణంగా చెబుతున్నారు. భారతదేశంలో 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రాగి ఉత్పత్తి 3.33 బిలియన్ టన్నులుగా ఉండగా.. 2023-24లో 3.78 టన్నులకు పెరిగింది. అయితే ఆ తర్వాతి ఫైనాన్షియర్ ఇయర్‌లో 3.56 టన్నులకు పడిపోయింది. ఉత్పత్తి తగ్గడం ధరలపై ప్రభావితం చూపుతోంది. దీంతో భవిష్యతుల్లో వెండి ధరలు మరో సిల్వర్ కానున్నాయా అనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.57 లక్షలుగా ఉంది. ఇక కేజీ వెండి రూ.2.80 లక్షల వద్ద కొనసాగుతోంది. అటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ధరలు కాస్త తగ్గడం, పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి.
