Post Office Schemes: ఆ పోస్టాఫీసు పథకంతో నెలనెలా ఆదాయం.. వడ్డీ రేటు ఎంతంటే..?

భారతదేశంలోని పెట్టుబడిదారులను ఏళ్లుగా పోస్టాఫీసు పథకాలు ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు పోస్టాఫీసుల్లో పొదుపు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రజలను ఆకర్షించేందుకు ప్రభుత్వం కూడా వివిధ పథకాలను ప్రకటిస్తూ ఉంటుంది. ఈనేపథ్యంలో నెలవారీ ఆదాయాన్నిచ్చే పోస్టాఫీసు పథకంపై ఇటీవల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ మంత్లీ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Post Office Schemes: ఆ పోస్టాఫీసు పథకంతో నెలనెలా ఆదాయం.. వడ్డీ రేటు ఎంతంటే..?
Follow us
Srinu

|

Updated on: Nov 20, 2024 | 4:22 PM

ప్రభుత్వ మద్దతుతో హామీతో వచ్చే సురక్షితమైన పెట్టుబడి ఎంపిక కోసం వెతికే వారికి పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మెరుగైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. పదవీ విరమణ తర్వాత నెలనెలా నిర్ణీత ఆదాయం కోసం చూసేవారు ఈ స్కీమ్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. అలాగే పొదుపును సురక్షితంగా పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్న వారికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, నమ్మకమైన చెల్లింపులో ఈ స్కీమ్ ప్రజలను ఆకర్షిస్తుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, హామీతో కూడిన నెలవారీ చెల్లింపులతో ప్రభుత్వ మద్దతుతో కూడిన పరిష్కారాన్ని అందిస్తుంది.

పోస్టాఫీస్ ఎంఐఎస్ స్కీమ్‌లో కనీస డిపాజిట్ రూ. 1,000 ఉంటుంది. అలాగే గరిష్ట డిపాజిట్ రూ. 9 లక్షలుగా ఉంటుంది. జాయింట్ ఖాతా ద్వారా పెట్టుబడిపెడితే రూ. 15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఈ స్కీమ్ పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది. ఈ పథకంలో వడ్డీ రేటు సంవత్సరానికి 7.4 శాతంగా ఉంది. అలాగే నెలవారీ ఆదాయం డిపాజిట్ మొత్తం × వడ్డీ రేటు ÷ 12 రేషియోలో అందిస్తారు. అంటే రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ. 3,083. రూ. 9 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ. 5,550, రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ. 9,250 చెల్లిస్తారు. ఆయా రిటర్న్‌లు 5 సంవత్సరాల కాలవ్యవధిలో స్థిరంగా ఉంటాయి.

ఈ పథకంలో నెలవారీ వడ్డీ జమ అవుతుంది. చెల్లింపులను ఈసీఎస్ ద్వారా స్వీకరించవచ్చు లేదా లింక్ చేసిన పొదుపు ఖాతాకు ఆటో-క్రెడిట్ అవుతుంది. క్లెయిమ్ చేయని వడ్డీపై అదనపు వడ్డీని అందించరు. అయితే ఈ వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పథకంలో అకాల ఉపసంహరణ చేస్తే మాత్రం జరిమానా విధిస్తారు. అకాల ఉపసంహరణ ఒక సంవత్సరం తర్వాత అనుమతిస్తారు. 1–3 సంవత్సరాలో డిపాజిట్ విత్ డ్రా చేసుకుంటే డిపాజిట్‌లో 2 శాతం తీసేస్తారు. 3 నుంచి 5 సంవత్సరాలు చేస్తే డిపాజిట్‌లో 1 శాతం తీసేస్తారు. ఈ ఖాతాలు 5 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతాయి. మెచ్యూరిటీ తర్వాత, ప్రిన్సిపల్ తిరిగి చెల్లిస్తారు. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో నామినీ/చట్టబద్ధమైన వారసులు ఖాతాను మూసివేయవచ్చు. అయితే మూసివేసిన ముందు నెల వరకు వడ్డీ చెల్లిస్తారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ పోస్టాఫీసు పథకంతో నెలనెలా ఆదాయం.. వడ్డీ రేటు ఎంతంటే..?
ఆ పోస్టాఫీసు పథకంతో నెలనెలా ఆదాయం.. వడ్డీ రేటు ఎంతంటే..?
పసుపును ఇలా తీసుకుంటే క్యాన్సర్‌ రాదు.. ఈ సమస్యలు మాయం!
పసుపును ఇలా తీసుకుంటే క్యాన్సర్‌ రాదు.. ఈ సమస్యలు మాయం!
స్వీటీ పక్కనున్నబ్యూటీని గుర్తుపట్టారా.?
స్వీటీ పక్కనున్నబ్యూటీని గుర్తుపట్టారా.?
కూలీ డబ్బులు ఎగ్గొట్టేందుకు పెద్ద స్కెచ్చే వేశారు.. ఇంటికి పిలిచి
కూలీ డబ్బులు ఎగ్గొట్టేందుకు పెద్ద స్కెచ్చే వేశారు.. ఇంటికి పిలిచి
39,481 కానిస్టేబుల్ పోస్టులు.. రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌
39,481 కానిస్టేబుల్ పోస్టులు.. రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌
ఈ ఏడాదిలో ఈ5 చర్యలు చేయండి శనీశ్వర అనుగ్రహంతో డబ్బు సమస్యలు దూరం
ఈ ఏడాదిలో ఈ5 చర్యలు చేయండి శనీశ్వర అనుగ్రహంతో డబ్బు సమస్యలు దూరం
తొడలు రాసుకుని ఎర్రగా కందిపోతున్నాయా.. ఈ చిట్కాలు బెస్ట్!
తొడలు రాసుకుని ఎర్రగా కందిపోతున్నాయా.. ఈ చిట్కాలు బెస్ట్!
కలియుగాంతాన్ని సూచించే ఈ ఆలయం.. ఎన్నో రహస్యాలకు నెలవు..
కలియుగాంతాన్ని సూచించే ఈ ఆలయం.. ఎన్నో రహస్యాలకు నెలవు..
నన్ను అరెస్ట్ చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించే ఛాన్స్ ఉంది:
నన్ను అరెస్ట్ చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించే ఛాన్స్ ఉంది:
లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ నటుడు.. నటి జ్యోతితో కలిసి
లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ నటుడు.. నటి జ్యోతితో కలిసి