Microsoft: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వర్లలో అంతరాయం.. విమాన సంస్థలపై ప్రభావం

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో (Microsoft outag) సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపచవ్యాప్తంగా చాలా మంది యూజర్లకు సమస్యను ఎదుర్కొన్నారు. కంప్యూటలో బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్‌ ఎర్రర్‌ మెసేజ్‌ రావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Microsoft: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వర్లలో అంతరాయం.. విమాన సంస్థలపై ప్రభావం
Microsoft Down
Follow us
Subhash Goud

|

Updated on: Jul 19, 2024 | 1:47 PM

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ((Microsoft) సర్వర్లు నిలిచిపోయాయి. దీని కారణంగా బ్యాంకుల నుండి విమానయాన సంస్థల వరకు సేవలకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా ఇండిగో, అకాసా ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్‌తో సహా అనేక విమానయాన సంస్థలు తమ విమానాలను గ్రౌండ్ చేయవలసి వచ్చింది. విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజీల పనితీరుపైనా ప్రభావం పడింది. చాలా మంది విండోస్ వినియోగదారులు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ఎర్రర్‌ను చూస్తున్నారు.

సర్వర్లలో అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో పలు కంపెనీల విమానాలు ఎగరలేకపోతున్నాయి. టికెట్ బుకింగ్ నుండి చెక్-ఇన్ వరకు సమస్యలు ఉన్నాయి. భారతదేశంలోని అనేక విమానాశ్రయాలు కూడా సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

US ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ఎక్కువగా ప్రభావితమైంది

మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో లోపం కారణంగా అమెరికా ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ఎక్కువగా ప్రభావితమైంది. ఢిల్లీ, ముంబై, బెర్లిన్, సిడ్నీ విమానాశ్రయాల్లో పనితీరుపై తీవ్ర ప్రభావం పడింది. సర్వర్ సమస్యల కారణంగా 131 విమానాలను రద్దు చేసినట్లు అమెరికా ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేసింది. యునైటెడ్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాలు నిలిచిపోయాయి. 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ లోపం కారణంగా అమెరికన్ ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ప్రభావితమైంది.

మేము నిరంతరం సేవలను మెరుగుపరుస్తున్నాము-మైక్రోసాఫ్ట్

ఇదిలా ఉండగా, సర్వర్ లోపంపై మైక్రోసాఫ్ట్ నుంచి ప్రకటన వెలువడింది. నిరంతరం సేవలను మెరుగుపరుస్తున్నామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. సమస్యను సరిదిద్దేందుకు అనేక బృందాలు పని చేస్తున్నాయని, ఇందుకు గల కారణాలను తెలుసుకుంటున్నామని తెలిపింది.

  • ఢిల్లీ విమానాశ్రయంలో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ లోపం కారణంగా సేవలు ప్రభావితమయ్యాయి.
  • డెన్మార్క్‌లో ఫైర్ అలారం పని చేయడం లేదు.
  • మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో లోపం కారణంగా ఆస్ట్రేలియాలో అత్యవసర సమావేశం జరుగుతోంది. ఈ లోపం కారణంగా ఆస్ట్రేలియా చెల్లింపు సేవ ప్రభావితమైంది.
  • అమెరికాలో 911 సర్వీస్ పని చేయడం లేదు.
  • దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌పై కూడా ఈ ఆందోళన నెలకొంది.
  • హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లే ప్రయాణికుడికి మాన్యువల్‌గా టికెట్ జారీ చేయబడింది.
  • బ్రిటన్‌లోని రైల్వే సర్వీసులు కూడా ఈ అంతరాయం కారణంగా దెబ్బతిన్నాయి. బ్రిటన్‌లో స్కై న్యూస్ లైవ్ టెలికాస్ట్ నిలిచిపోయింది.
  • నెదర్లాండ్స్‌లో విమాన సర్వీసులు కూడా దెబ్బతిన్నాయి.
  • విమానయాన సంస్థల ద్వారా ప్రయాణికులకు ఒక సలహా జారీ అయ్యింది.
  • అమెరికాలో స్కై న్యూస్ ప్రత్యక్ష ప్రసారం ఆగిపోయింది.
  • లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సేవలు నిలిచిపోయాయి.
  • జర్మనీలో బెర్లిన్ విమానాశ్రయంలో అన్ని విమాన సేవలకు అంతరాయం.
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేజర్ ఐటీ కంపెనీలపై ప్రభావం
  • ప్రసారాలు జరుగుతుండగా మధ్యలో నిలిచిపోయిన స్కై న్యూస్.
  • మెరికన్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, అల్లెజియంట్ ఎయిర్‌లైన్స్ తమ అన్ని విమానాలను నేలకు దించాయి.
  • ఆస్ట్రేలియాలో అనేక విమాన సేవలు ప్రభావితమయ్యాయి.
  • బ్యాకింగ్ సేవల్లో అంతరాయం.
  • ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు, అమెరికాలో ఎమర్జెన్సీ 911 కాల్ సెంటర్లు, విమానాశ్రయాలు, పోర్టులు సహా అనేక విభాగాల్లో నిలిచిన సేవలు.
  • వివిధ Microsoft 365 యాప్‌లు, సేవలను యాక్సెస్ చేయగల వినియోగదారుల సామర్థ్యాన్ని ప్రభావితం చేసే సమస్యను పరిశీలిస్తున్నట్టు ప్రకటించిన మైక్రోసాఫ్ట్
  • టెలీకాం సేవలకు కూడా విఘాతం
  • అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి