MG Motor India: ప్రస్తుతం వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఇప్పటికే పలు వాహనాలు అందుబాటులోకి రాగా, మరిన్ని కంపెనీలు అదేబాటలో పయనిస్తున్నాయి. ఇక 2023 మార్చి నాటికి రూ.10 నుంచి రూ.15 లక్షల్లో విద్యుత్ కార్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ విద్యుత్ ఎస్‌యూవీ జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. ఇక తదుపరి కొత్తగా భారత్‌లో ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ కారును తీసుకువస్తున్నట్లు ఎంజీ మోటారు ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా ప్రకటించారు. రూ.10-15 లక్షల మధ్య ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తే మరింత మంది కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు.
ఎంజీ మోటారు జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ రెండు వేరియంట్ల ధర రూ.21-24.68 లక్షలుగా ఉంది. ప్రస్తుతం 2వేలకుపైగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇక సెమీ కండక్టర్ల కొరతతో నెలకు 250-300 వాహనాలనే సరఫరా చేయగలుగుతున్నామని కంపెనీ తెలిపింది. ఫిబ్రవరి నుంచి నెలకు 500లకుపైగా కార్లను వినియోగదారులకు అందిస్తామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి: