AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iron Ore: ఉత్పత్తిలో ఆ ప్రభుత్వ కంపెనీ రికార్డు.. ఏకంగా 15 శాతం పెరుగుదల

ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు వృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో ఉన్న వివిధ సంస్థలు ఆ రంగంలో వృద్దిని నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ ఐరన్ ఓర్ ఉత్పత్తిలో రికార్డులను సృష్టించింది. ఈ నేపథ్యంలో ఎన్ఎండీసీ ఐరన్ ఓర్ ఉత్పత్తి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Iron Ore: ఉత్పత్తిలో ఆ ప్రభుత్వ కంపెనీ రికార్డు.. ఏకంగా 15 శాతం పెరుగుదల
Nmdc
Nikhil
|

Updated on: May 05, 2025 | 11:22 AM

Share

ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్ఎండీసీ ఏప్రిల్‌లో ఇనుప ఖనిజం ఉత్పత్తిలో 15 శాతం పెరుగుదల, ఖనిజ అమ్మకాల్లో 3 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు నివేదించింది. ఇటీవల విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్ఎండీసీ ఏప్రిల్‌లో 4 మిలియన్ టన్నుల (ఎంఎన్‌టీ) ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసిందని , గత ఏడాది ఇదే నెలలో ఇది 3.48 ఎంఎన్‌టీ గా ఉందని తెలిపింది. ఎన్ఎండీసీ గత నెలలో 3.63 ఎంఎన్‌టీ ఇనుప ఖనిజాన్ని విక్రయించింది. ఇది ఏప్రిల్ 2024లో 3.53 ఎంఎన్‌టీగా ఉంది. ఈ కొత్త రికార్డులపై ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ మాట్లాడుతూ ఏప్రిల్‌లో రికార్డు స్థాయి పనితీరుతో ప్రధాన ఇనుప ఖనిజ గనులైన కిరండుల్, బచేలి, దోనిమలై ద్వారా వరుసగా 12 శాతం, 4 శాతం, 88 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. 

ముఖ్యంగా 2030 నాటికి 100 ఎంటీ మైనింగ్ కంపెనీగా మారాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో పని చేస్తున్నట్లు ముఖర్జీ స్పష్టం చేశారు. ఎన్ఎండీసీ కంపెనీ పెల్లెట్ ఉత్పత్తి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 0.23 లక్షల టన్నులకు పెరిగింది. ఇది 2018 ఏప్రిల్ నెలలో నెలకొల్పిన మునుపటి రికార్డును అధిగమించింది. భారత ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ భారతదేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తి సంస్థగా ఉంది. 

అయితే ఎన్ఎండీసీ నుంచి విడిపోయిన ఎన్ఎండీసీ  స్టీల్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) మార్చిలో ఉత్పత్తి చేసిన 2,11,978 టన్నుల నుండి ఏప్రిల్‌లో దాని హాట్ మెటల్ ఉత్పత్తిలో నెలవారీ 8.5 శాతం వృద్ధిని నమోదు చేసి 2,30,111 టన్నులకు చేరుకుందని తెలిపింది.  భారతదేశంలో అతి చిన్న స్టీల్ యూనిట్‌గా ఉన్న చత్తీస్‌గఢ్‌లోని ఎన్ఎస్ఎల్‌కు సంబంధించి 3 మిలియన్ టన్నుల నగర్ స్టీల్ ప్లాంట్‌ను రూ.24,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్