AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki Victoris: మారుతి సుజుకీ ఫ్యామిలీ ఎస్‌యూవీ! రూ. 10 లక్షలకే ప్రీమియం ఫీచర్లు!

మారుతీ సుజుకీ నుంచి లేటెస్ట్ ఓ కొత్త ఫ్యామిలీ ఎస్ యూవీ లాంఛ్ అయింది. రూ. 10 లక్షల ధరలో రిలీజైన ఈ కారులో చాలా ప్రత్యేకతలున్నాయి. సేఫ్టీ రేటింగ్ కూడా 5 స్టా్ర్స్ సాధించింది. ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లున్నాయి? ఏయే వేరియంట్ ఎంత ధరకు లభిసస్తుంది వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Maruti Suzuki Victoris:  మారుతి సుజుకీ ఫ్యామిలీ ఎస్‌యూవీ! రూ. 10 లక్షలకే ప్రీమియం ఫీచర్లు!
Maruti Suzuki Victoris
Nikhil
|

Updated on: Sep 16, 2025 | 11:28 AM

Share

ఫ్యామిలీ కార్స్ కు పెట్టింది పేరు మారుతి సుజుకీ. తక్కువ ప్రైస్ రేంజ్ లో మిడిల్ క్లాస్ కు కూడా ఎఫర్డబుల్ గా ఉండేలా కార్స్ రిలీజ్ చేస్తుంటుంది.  తాజాగా ఫ్యామిలీ ఎస్ యూవీ కేటగిరీలో మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ కారు రిలీజ్ చేసింది. అదే మారుతీ సుజుకీ విక్టోరిస్. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే..

రూ. 10 లక్షల ప్రైస్ రేంజ్ లో ప్రీమియం లుక్ ఉండేలా ఈ కారు డిజైన్ చేశారు. ఈ ఎస్‌యూవీలో లేటెస్ట్ టెక్నాలజీతో పాటు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అలాగే 6 ఎయిర్​బ్యాగ్​లు, ఈఎస్​సీ, పెడిస్ట్రియన్​ ప్రొటెక్షన్​ సిస్టమ్​, హెడ్స్​ అప్​ డిస్​ప్లే, 360 డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంజిన్

ఇక ఇంజిన్ విషయానికొస్తే.. మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారాలో ఉండే ఇంజిన్ నే దీనికీ అమర్చారు. 1.5 లీటర్ పెట్రోల్​ ఇంజిన్​ విత్ 5 స్పీడ్​ మేన్యువల్​ లేదా 6 స్పీడ్​ ఆటోమెటిక్​ ట్రాన్స్​మిషన్​ గేర్​బాక్స్ తో వస్తుంది. అలాగే ఈ కారుకి పెట్రోల్ ట్యాంక్ తో పాటు అండర్​బాడీ సీఎన్‌జీ ట్యాంక్ కూడా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా ఎక్కువే. కారు మైలేజ్ వేరియంట్ ను బట్టి 20 కి.మీ నుంచి 28 కి.మీ వరకూ వస్తుంది.

ఇంటీరియర్

కారు ఇంటీరియర్ లుక్ ప్రీమియంగా ఉంటుంది. కారు లోపల 64 యాంబియెంట్​ లైట్​ కలర్​ ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. డ్యాష్ బోర్డుపై 10.25 ఇంచ్​ డిజిటల్​ డ్రైవర్​ డిస్​ప్లేతో పాటు 35 ప్రీలోడెడ్ యాప్స్ తో కూడిన టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టమ్​ ఉంటుంది. సుజుకీ కనెక్ట్​ ద్వారా అదనంగా 60 ఫీచర్స్ పొందొచ్చు. అలగే కారు పైన డ్యుయెల్​ పేన్​ సన్​రూఫ్​, పీఎం 2.5 ఎయిర్​ ఫిల్టర్​, 8 స్పీకర్​ సరౌండ్​ సౌండ్​ విత్​ డాల్బీ అట్మోస్​, 8వే పవర్డ్​- వెంటిలేటెడ్​ సీట్లు ఉంటాయి.

ధరలు

ఇక కారు ధరల విషయానికొస్తే.. మారుతీ సుజుకీ విక్టోరిస్ లో ఎల్​ఎక్స్​ఐ, వీఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐ(ఓ), జెడ్​ఎక్స్​ఐ ప్లస్​, జెడ్​ఎక్స్​ఐ ప్లస్​(ఓ) వంటి పెట్రోల్  అండ్ హైబ్రిడ్ వేరియంట్లు ఉన్నాయి. పెట్రోల్​ వేరియంట్ల ధరలు రూ. 10.50లక్షల నుంచి రూ. 17.77లక్షల వరకు ఉన్నాయి. ఆల్ వీల్​ డ్రైవ్​ ఆప్షన్​ రూ. 18.64 నుంచి మొదలవుతుంది.  సీఎన్జీ ఆప్షన్ ధర రూ. 11.50లక్షల మొదలవుతుంది. హైబ్రిడ్ టాప్ ఎండ్ ధర రూ. 19.99లక్షల వరకు ఉంటుంది.  ఈ ఎస్‌యూవీ  అమ్మకాలు సెప్టెంబర్ 22 నుంచి మొదలుకానున్నాయి. ఇప్పట్నుంచే ప్రీ బుకింగ్స్‌ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..