AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki Swift 2023:మారుతి సుజుకీ నుంచి స్విఫ్ట్‌ కొత్త మోడల్‌.. ఎలాంటి ఫీచర్స్‌ ఉండబోతున్నాయి..?

మారుతి సుజుకి స్విఫ్ట్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీని గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. స్విఫ్ట్ పాపులారిటీని..

Maruti Suzuki Swift 2023:మారుతి సుజుకీ నుంచి స్విఫ్ట్‌ కొత్త మోడల్‌.. ఎలాంటి ఫీచర్స్‌ ఉండబోతున్నాయి..?
Maruti Suzuki Swift 2023
Subhash Goud
|

Updated on: Oct 26, 2022 | 12:30 PM

Share

మారుతి సుజుకి స్విఫ్ట్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీని గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. స్విఫ్ట్ పాపులారిటీని కొనసాగించేందుకు మారుతీ సుజుకి తన కొత్త మోడల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం, కొత్త తరం స్విఫ్ట్ గ్లోబల్ డెబ్యూ ఈ సంవత్సరం చివరి నాటికి విడుదల చేయవచ్చు. కొన్ని నెలల క్రితం రాబోయే కొత్త మోడల్ విదేశాలలో కూడా కనిపించింది. మారుతి సుజుకి స్విఫ్ట్ అటువంటి మోడల్ ఇది ప్రతి నెలా మంచి విక్రయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మారుతి స్విఫ్ట్ మూడవ తరం మోడల్ మొదటిసారి 2018 లో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుండి ప్రముఖ మోడల్‌కు కంపెనీ పెద్దగా అప్‌డేట్‌లు ఏమీ ఇవ్వలేదు. ఏది ఏమైనప్పటికీ సరికొత్త స్విఫ్ట్ ఈ సంవత్సరం చివర్లో లేదా 2023 ప్రారంభంలో ప్రపంచవ్యాప్త ఆవిష్కరించబడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో భారతదేశంలో రాబోయే కారును వచ్చే ఏడాది లేదా 2024 నాటికి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2023 స్విఫ్ట్: మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్త మోడల్ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌లో చాలా అప్‌డేట్‌లను పొందవచ్చని భావిస్తున్నారు. ఆటో వెబ్‌సైట్ గాడివాడి ప్రకారం.. కొత్త మోడల్‌లో భాగంగా కొత్త ఇంటిగ్రేటెడ్ LED DRLలతో రూపొందించబడి బానెట్, బ్రైటర్ గ్రిల్ సెక్షన్, అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్, రియర్ బంపర్‌లు, కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌తో కూడిన షార్ప్ హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

2023 స్విఫ్ట్: ఇంటీరియర్ స్విఫ్ట్ కొత్త తరం మోడల్ క్యాబిన్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రావచ్చు. అదే సమయంలో డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌తో పాటు ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కూడా అప్‌డేట్ చేయవచ్చు.

2023 స్విఫ్ట్: ప్రస్తుతం ఉన్న K12 సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT 1.2L పెట్రోల్ ఇంజన్‌ను భారత మార్కెట్‌లో ఉంచవచ్చు. స్టార్ట్-స్టాప్ ఫంక్షన్‌తో వస్తున్న ఈ ఇంజన్ గరిష్టంగా 89 bhp శక్తిని, 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ AMT తో వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి