Budget 2025: పోస్టల్ శాఖలో భారీ మార్పులు.. ఆదాయం పెరుగుదలే లక్ష్యం

భారతదేశంలో పోస్టాఫీసులు ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పౌరులకు సేవలను అందిస్తున్నాయి. కేవలం ఉత్తరపత్యుత్తరాలకే కాకుండా పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలను కూడా అందించడంతో మధ్యతరగతి ప్రజలకు మరింత చేరవయ్యాయి. అయితే 2025 బడ్జెట్ ప్రకటనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పోస్టాఫీసు సేవల విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Budget 2025: పోస్టల్ శాఖలో భారీ మార్పులు.. ఆదాయం పెరుగుదలే లక్ష్యం
రూ.10 లక్షల పెట్టుబడి: అదేవిధంగా మీరు రూ.10 లక్షల పెట్టుబడి పెడితే మీకు రూ.10 లక్షల వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత మీకు మొత్తం రూ.20 లక్షలు అందుతాయి. కిసాన్ వికాస్ పత్ర యోజన పెట్టుబడిదారులకు పూర్తిగా సురక్షితం. ఈ పథకంలో జమ చేసిన ప్రతి రూపాయి సురక్షితంగా ఉంటుంది. ప్రభుత్వం స్థిర వడ్డీ రేటుకు హామీ ఇస్తుంది. పోస్టాఫీసు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అందుకే మీ పెట్టుబడిపై ఎటువంటి ప్రమాదం ఉండదు. మీరు సురక్షితమైన పెట్టుబడి, మంచి రాబడిని కోరుకుంటే కిసాన్ వికాస్ పత్ర యోజన మీకు అనువైన ఎంపిక.

Updated on: Feb 02, 2025 | 4:45 PM

150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన, ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్‌వర్క్ అయిన ఇండియా పోస్ట్‌ను 1.5 లక్షల గ్రామీణ తపాలా కార్యాలయాలతో “పెద్ద లాజిస్టిక్స్ సంస్థ”గా మార్చనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2025ను సమర్పిస్తూ  గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇండియా పోస్ట్‌కు సంబంధించిన పరివర్తన ఒక ఉత్ప్రేరకంగా పని చేస్తుందని సీతారామన్ హామీ ఇచ్చారు. గ్రామీణ రంగానికి సంబంధించిన ఇతర సంస్కరణ చర్యలలో రుణ కార్యకలాపాల కోసం నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మద్దతు ఉందని చెప్పారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో 1.5 లక్షల గ్రామీణ తపాలా కార్యాలయాలు, 2.4 లక్షల మంది డాక్ సేవకుల విస్తృత నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని వివరించరు. 

ఇండియా పోస్ట్‌ను మార్చే ప్రణాళికలను టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గతేడాది సెప్టెంబర్‌లో మొదటిసారి ప్రకటించారు. దీన్ని లాజిస్టిక్స్ సంస్థగా మార్చడం వల్ల వచ్చే మూడు, నాలుగేళ్లలో శాఖ ఆదాయం 50 నుంచి 60 శాతం పెరుగుతుందని ఆయన చెప్పారు. దీని కోసం,  ఆక్ష్న డిసెంబర్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి నిధులను కోరారు. తద్వారా 2029 నాటికి డిపార్ట్‌మెంట్‌ను లాభదాయకంగా మార్చడానికి, లాజిస్టిక్స్ కంపెనీగా  మార్చడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వస్తువుల డెలివరీ సేవలను పెంపొందించడానికి సహాయం చేస్తుందని వివరించారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో శాఖ పాత్రను పెట్టుబడిగా పెట్టుకునే దిశగా ముందుకు సాగింది.

డిసెంబరులో డిపార్ట్‌మెంట్ కోసం కొత్త డెవలప్‌మెంట్ ప్లాన్ కోసం తన ప్రెజెంటేషన్‌ను ఇస్తూ త్వరలోనే పోస్టల్ సేవలను ప్రజల ఇంటి వద్దకు తీసుకెళ్తామని సింధియా చెప్పారు. డిపార్ట్‌మెంట్ ఆదాయాన్ని పెంచడానికి, ఖర్చులను హేతుబద్ధీకరించడం, మెజారిటీ ప్రక్రియలను డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో సహా అన్ని సంభావ్య సేవలను పరిశీలిస్తామన్నారు. ఉత్తరం  డెలివరీ చేయడం మాత్రమే కాకుండా ఇండియా పోస్ట్ బ్యాంకింగ్ సేవలు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్‌పీఎల్ఐ) ద్వారా జీవిత బీమా, బిల్లు చెల్లింపులు వంటి రిటైల్ సేవలు, అలాగే ఎంజీఎన్ఆర్ఈజీఏ వేతనాలు పంపిణీ చేయడంలో కూడా పాల్గొంటుందని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి