ఒక వైపు నిత్యవసర సరుకుల ధరలతో పాటు అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వేగంగా పెరిగి ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. ఇలాంటి సమయంలో పీఎన్‌జీ, సీఎన్‌జీ ధరలు కూడా మరోసారి పెరగడం వాహనదారులకు షాకిచ్చినట్లయ్యింది. సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు మరోసారి పెరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివసిస్తున్న ప్రజలకు ధరల పెరుగుదల ఆందోళనకు గురి చేసింది. రాష్ట్ర నియంత్రణలో ఉన్న గ్యాస్ సరఫరాదారు మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (ఎంజీఎల్) శుక్రవారం మరోసారి సీఎన్‌జీ, పైప్డ్ ఎల్‌పీజీ అంటే పీఎన్‌జీ ధరలను పెంచింది. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్ ధరను అక్టోబర్ ప్రారంభంలో కేంద్రం 40 శాతం పెంచింది. అంతకుముందు ఏప్రిల్‌లో కూడా గ్యాస్ ధర 110 శాతం పెరిగింది.
ధరలు పెరిగిన తర్వాత సీఎన్‌జీ కిలో ధర రూ.3.50 పెరిగి రూ.89.50కి చేరింది. అదే సమయంలో దేశీయ పీఎన్‌జీ క్యూబిక్ మీటర్‌కు రూ.1.50 నుండి రూ.54 వరకు పెరిగింది. కొత్త రేట్లు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 1న వాహనాల్లో ఇంధనంగా ఉపయోగించే సిఎన్‌జి ధర కిలో రూ.60 ఉండగా, దేశీయంగా ఎల్‌పిజి పిఎన్‌జి క్యూబిక్ మీటర్‌కు రూ.36గా ఉంది.
గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని ఎంజీఎల్ సరఫరా 10 శాతం తగ్గిందని, ఇది డిమాండ్ నిలకడ కారణంగా అధిక ధరలకు గ్యాస్ కొనుగోలు చేయవలసి వస్తోందని ఎంజీఎల్ తెలిపింది. అంతే కాదు రూపాయి పడిపోవడంతో నష్టం కూడా వచ్చింది. గ్యాస్ ధరల పెరుగుదల మధ్య డాలర్‌తో రూపాయి పతనం ప్రభావాన్ని తగ్గించడానికి ఎంజీఎల్ సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను పెంచింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి