LML star EV: ఎల్ఎంఎల్ మళ్లీ వచ్చేస్తోంది.. తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలకు రంగం సిద్ధం..!

|

Sep 24, 2024 | 4:30 PM

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో రోజుకో కొత్త మోడల్ స్కూటర్ విడుదలవుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు ప్రజల ఆదరణ బాగుంది. దానికి అనుగుణంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దాదాపు అన్ని ద్విచక్ర వాహనాల కంపెనీలు ఈ రంగంలో అడుగుపెట్టాయి. వివిధ ఫీచర్లు, ప్రత్యేకతలతో తమ బ్రాండ్ వాహనాలను ఆవిష్కరిస్తున్నాయి.

LML star EV: ఎల్ఎంఎల్ మళ్లీ వచ్చేస్తోంది.. తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలకు రంగం సిద్ధం..!
Lml Star Ev
Follow us on

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో రోజుకో కొత్త మోడల్ స్కూటర్ విడుదలవుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు ప్రజల ఆదరణ బాగుంది. దానికి అనుగుణంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దాదాపు అన్ని ద్విచక్ర వాహనాల కంపెనీలు ఈ రంగంలో అడుగుపెట్టాయి. వివిధ ఫీచర్లు, ప్రత్యేకతలతో తమ బ్రాండ్ వాహనాలను ఆవిష్కరిస్తున్నాయి. పర్యావరణంపై ప్రజలకు పెరిగిన అవగాహన, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల కారణంగా వీటి విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ప్రఖ్యాత ద్విచక్ర తయారీ సంస్థ ఎల్ఎంఎల్ ఈ రంగంలోకి అడుగుపెడుతోంది. తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. స్టార్ పేరుతో విడుదల చేయనున్న స్కూటర్ కు సంబంధించిన డిజైన్ పై పేటెంట్ ను పొందింది.ఈ ఏడాది చివరిలో ఈ స్కూటర్ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఎల్ఎంఎల్ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. అదిరి పోయే స్టైల్ తో ఎల్ఎంఎల్ స్టార్ స్కూటర్ ఎంతో ఆకట్టుకుంటోంది. గతేగాది గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది. ప్రముఖ ద్విచక్ర వాహనాలను రూపొందించిన దిగ్గజాలతో దీన్ని డిజైన్ చేసినట్టు కంపెనీ వెల్లడించింది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ద్వితీయార్థంలో స్టార్ స్కూటర్ విడుదల అవుతుంది. అయితే పండగల సీజన్లలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో తన స్థానాన్ని పెంచుకోవడానికి ఎల్ఎంఎల్ కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తుంది. దానిలో భాగంగా మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడానికి చర్యలు తీసుకుంది. వాటిలో స్టార్ స్కూటర్ ను మొదట ఆవిష్కరించనుంది. దీని తర్వాత మూన్ షాట్, ఓరియన్ పేర్లతో మరో రెండు స్కూటర్లు విడుదలవుతాయి. మొదటి స్కూటర్ అయిన స్టార్ లుక్ ను విడుదల చేసింది.

ఎల్ఎంఎల్ స్టార్ ఈవీ డిజైన్ ఎంతో ఆకట్టుకుంటోంది డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ వైట్ బాడీ కలర్, ఎల్ఈడీ డీఆర్ ఎల్, ప్రొజెక్టర్ హెడ్ లైట్లు, రెడ్ యాక్సెంట్ ఏర్పాటు చేశారు. ఫీచర్ల పరంగా ఈ స్కూటర్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేలా వీటిని తీర్దిదిద్దారు. ఆటోమేటిక్ హెడ్ లైట్, ముందు ఆప్రాన్, వెనుక స్క్రీన్, వైర్ లెస్ చార్జర్, యాంటియంట్ లైటింగ్, డిజిటల్ స్క్రీన్ తదితర ఫీచర్లు ఏర్పాటు చేశారు. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హూస్ట్ అసిస్ట్, రివర్స్ మోడ్, ఏబీఎస్ తదితర భద్రతా ఫీచర్లు కనిపిస్తాయి. ఎల్ఎంఎల్ స్టార్ స్కూటర్ లో ఏర్పాటు చేసే బ్యాటరీ గురించి కంపెనీ వివరాలేమీ తెలపలేదు. అయితే 2 కేడబ్ల్యూహెచ్ కెపాసిటీ కలిగిన రెండు సెట్ రిమూవబుల్ బ్యాటర్ ప్యాక్ లతో వస్తుందని, ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని భావిస్తున్నారు. అలాగే గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈ బండి పరుగులు తీస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..