Traffic Rules: ట్రాఫిక్ జరిమానాలతో బీమా పాలసీల లింక్.. కేంద్ర మంత్రికి లేఖ రాసిన గవర్నర్
భారతదేశంలో ఇటీవల కాలంలో వాహనాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఏదో వాహనం ఉంటుంది. అయితే వాహన ప్రమాదాల నేపథ్యంలో ప్రతి వాహన కొనుగోలు సమయంలోనే ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి చేసింది. అయితే వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలను కట్టడి చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
భారతదేశంలో ఇటీవల కాలంలో వాహనాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఏదో వాహనం ఉంటుంది. అయితే వాహన ప్రమాదాల నేపథ్యంలో ప్రతి వాహన కొనుగోలు సమయంలోనే ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి చేసింది. అయితే వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలను కట్టడి చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ముఖ్యంగా వాహనాల బీమా ప్రీమియాన్ని ఆయా వాహనాలపై నమోదైన ట్రాఫిక్ జరిమానాల సంఖ్యకు అనుసంధానం చేయాలని కోరారు. యూఎస్‌లోని అనేక రాష్ట్రాలతో పాటు యూరోపియన్ దేశాల్లో ఈ విధానం అమల్లో ఉందని ఈ విధానాన్ని భారత్‌లో కూడా అమలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రికి గవర్నర్ రాసిన లేఖలోని ముఖ్యాంశాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఇటీవలి కాలంలో మృతుల సంఖ్య బాగా పెరిగింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా భారతీయ రోడ్లు, వాహనాలను సురక్షితంగా మార్చాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాహన బీమా ప్రీమియంలను ట్రాఫిక్ జరిమానాల సంఖ్యతో లింక్ చేయడం వల్ల ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే అలవాటు ఉన్నవారిని కట్టడి చేయవచ్చని చెబుతున్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2022లో 4.57 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దీనివల్ల 1.55 లక్షల మంది మరణించారు. ఉల్లంఘనల్లో, అతివేగం ప్రమాదాలకు మొదటి కారణం కాగా, ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘనల తర్వాతి స్థానంలో ఉంది.
మెరుగైన రోడ్లు, సురక్షితమైన వాహనాలు, ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన వంటి అంశాల్లో కచ్చితంగా వాహనాదారులు అవగాహనతో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా చేయాలంటే కచ్చితంగా బీమా ప్రీమియంను లింక్ చేయడమే మార్గమని కొంత మంది నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి వ్యవస్థను అమలు చేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి బీమా నియంత్రణ, ఐఆర్‌డీఏఐతో చర్చలను ప్రారంభించేందుకు జోక్యం చేసుకోవాలని సక్సేనా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..