LIC Customers: ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు పాలసీదారులకు మేలు కలిగించే అంశాలపై నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు బయటకు రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ పాలసీదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఐసీ యూన్యుటీ ప్లాన్ తీసుకున్న కస్టమర్లు లైఫ్ సర్టిఫికెట్‌ను ఈమెయిల్ ద్వారా కూడా సబ్మిట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఎల్‌ఐసీ సంస్థ వెల్లడించింది. వీడియో కాల్ ద్వారా కూడా సర్టిఫికెట్‌ను తీసుకుంటున్నట్లు తెలిపింది.
క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను కూడా సింపుల్‌గా మార్చింది. కరోనా కారణంగా ఎవరైనా పాలసీదారుడు మృతి చెందితే మున్సిపల్ డెత్ సర్టిఫికేట్ లేకపోయినా క్లెయిమ్స్‌ను చెల్లిస్తోంది. డెత్ సర్టిఫికేట్‌కు బదులుగా డిశ్చార్జ్ సమ్మరీ, ఈఎస్‌ఐ లేదా ప్రభుత్వ లేదా కార్పొరేట్ ఆస్పత్రులు అందించే డెత్ సమ్మరీ ప్రూఫ్‌ను సమర్పిస్తే సరిపోతుంది.
అయితే ఎల్‌ఐసీ తన కస్టమర్ల కోసం ఎన్నో స్కీమ్లను ప్రవేశపెడుతోంది. అంతేకాదు వినియోగదారులు క్లెయిమ్స్ విషయంలో సులభతరమైన పద్దతులను అందుబాటులోకి తీసుకువస్తోంది. గతంలో కంటే ఈ కరోనా కాలంలో పాలసీలు చేసుకునేవారి సంఖ్య చాలా పెరిగిపోయింది. గతంలో పెద్దగా పట్టించుకోని కస్టమర్లు.. కోవిడ్ పరిస్థితులను ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాలసీల సంఖ్య పెరిగిపోతున్నాయి.