LIC New Plan: ఎల్‌ఐసీలో సరికొత్త పాలసీ.. ఆకర్షణీయమైన రాబడితో పాటు అదనపు బోనస్‌లు

ఎల్ఐసీ మరో కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా హామీ ఇచ్చిన రాబడితో పాటు అదనపు బోనస్‌లు కూడా వినియోగదారుల చేతిక వస్తాయి. అయితే ఈ బోనస్‌లు మాత్రం ఏ సంవత్సారానికి ఆ సంవత్సరం చెబుతుంటారు.

LIC New Plan: ఎల్‌ఐసీలో సరికొత్త పాలసీ.. ఆకర్షణీయమైన రాబడితో పాటు అదనపు బోనస్‌లు
LIC
Follow us
Srinu

|

Updated on: Feb 16, 2023 | 4:10 PM

భారతీయులకు జీవిత బీమా అంటే ముందుగా గుర్తుకువచ్చేది ఎల్ఐసీ. ముఖ్యంగా పెట్టిన పెట్టుబడి భరోసా ఉంటుందని అందరూ ఎల్ఐసీను ఆదరిస్తారు. ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పోటీలో ఉన్నా ఎల్ఐసీ తన మార్క్ నమ్మకంతో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తూ వినియోదారుల మనన్నలు అందుకుంటుంది. ప్రస్తుతం ఎల్ఐసీ మరో కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా హామీ ఇచ్చిన రాబడితో పాటు అదనపు బోనస్‌లు కూడా వినియోగదారుల చేతిక వస్తాయి. అయితే ఈ బోనస్‌లు మాత్రం ఏ సంవత్సారానికి ఆ సంవత్సరం చెబుతుంటారు. అలాగే పాలసీ వ్యవధి కూడా 12 నుంచి 35 సంవత్సరాల వరకూ ఉంటుంది. ఈ పాలసీను కనీస హామీ మొత్తం రూ.లక్షతో ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే గరిష్ట హామీ మొత్తం మాత్రం లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. పాలసీదారు పరిమిత లేదా సాధారణ ప్రీమియం చెల్లింపుల మోడ్‌లను ఎంచుకోవచ్చు. అలాగే ఆదాయపు పన్ను మినాహాయింపులను కూడా వినియోగదారుల పొందుతారు. అలాగే ప్రతి ఏడాది కస్టమర్లకు వచ్చే బోనస్‌లను పాలసీ వ్యవధిలో జమ చేస్తారు. అదనంగా పాలసీదారు మెచ్యూరిటీ వరకూ పాలసీ కొనసాగిస్తే టెర్మినల్ బోనస్‌ను కంపెనీ అందిస్తుంది. ఈ ఎల్ఐసీ ఎండోమెంట్ పాలసీ ఎనిమిది నుంచి 50 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారు తీసుకోవచ్చు. పాలసీదారుకు మెచ్యూరిటీ సమయానికి గరిష్టంగా 75 సంవత్సరాలు ఉండాలి. 

పాలసీ తీసుకోవడం ఇలా

ఈ పాలసీను భారతీయులతో పాటు భారతీయ మూలం ఉన్న విదేశీయులు కూడా తీసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌తో పాటు వయస్సు నిర్ధారణ పత్రం, చిరునామా, గుర్తింపు రుజువును సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ రెండు పద్ధతుల్లో వినియోగదారులు ఈ పాలసీని పొందవచ్చు. ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో బై పాలసీ ఆన్‌లైన్ ట్యాబ్‌ను క్లిక్ చేసి పాలసీ ఎంచుకుని పొందవచ్చు. మార్కెట్ నిపుణుల సూచన ప్రకారం ఎల్ఐసీలో ఎక్కువ మొత్తం రాబడి పొందాలంటే కనీసం 20 సంవత్సరాల పాలసీ వ్యవధి ఉండేలా చేసుకోవాలి. ఓ వినియోగదారుడు రూ.10 లక్షల పాలసీ తీసుకున్నాడనుకుంటే ఎల్ఐసీ అందించే బోనస్‌లు నాలుగు శాతం వరకూ వస్తాయని అంచనా వేసుకోవాలి. వాటితో పాటు టెర్మినల్ బోనస్ రూ.1.5 లక్షల వరకూ వినియోగదారుడు పొందుతాడు. అంటే దాదాపు రూ.17.2 లక్షలు సొమ్ము మెచ్యూరిటీ అనంతరం కస్టమర్ చేతికి అందుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!