AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki Swift: మార్కెట్‌లోకి స్విఫ్ట్ సీఎన్‌జీ లాంచ్.. ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో సీఎన్‌జీ వాహనాల హవా నడుస్తుంది. ముఖ్యంగా కార్ల కంపెనీలు తమ కారు మోడల్స్‌ను సీఎన్‌జీ వేరియంట్స్‌లో రిలీజ్ చేస్తున్నాయి. భారతదేశంలో బడ్జెట్ ఫ్రెండ్లీ కారు అంటే అందరికీ టక్కున గుర్తు వచ్చే మారుతీ సుజుకీ స్విఫ్ట్ 2024వ సంవత్సరంలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఆగస్ట్ మినహా మిగిలిన అన్ని నెలలు కార్ల అమ్మకాల్లో మొదటి మూడు స్థానాల్లో స్థిరంగా ఉంది.

Maruti Suzuki Swift: మార్కెట్‌లోకి స్విఫ్ట్ సీఎన్‌జీ లాంచ్.. ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Maruti Suzuki Swift Cng
Nikhil
|

Updated on: Sep 12, 2024 | 7:15 PM

Share

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో సీఎన్‌జీ వాహనాల హవా నడుస్తుంది. ముఖ్యంగా కార్ల కంపెనీలు తమ కారు మోడల్స్‌ను సీఎన్‌జీ వేరియంట్స్‌లో రిలీజ్ చేస్తున్నాయి. భారతదేశంలో బడ్జెట్ ఫ్రెండ్లీ కారు అంటే అందరికీ టక్కున గుర్తు వచ్చే మారుతీ సుజుకీ స్విఫ్ట్ 2024వ సంవత్సరంలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఆగస్ట్ మినహా మిగిలిన అన్ని నెలలు కార్ల అమ్మకాల్లో మొదటి మూడు స్థానాల్లో స్థిరంగా ఉంది. అయితే కార్ల అమ్మకాల్లో స్థిరంగా నిలబడాలనే ఉద్దేశంలో తాజాగా స్విఫ్ట్ సీఎన్‌జీ వేరియంట్‌ను లాంచ్ చేశారు. స్విఫ్ట్ సీఎన్‌జీ వేరియంట్ ధర రూ. 8.20 లక్షలుగా ఉంది. ఈ కారు టాటా టియాగో సీఎన్‌జీ, గ్రాండ్ ఐ10 నియో సీఎన్‌జీలకు గట్టి పోటీనివ్వనుంది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ స్విఫ్ట్ సీఎన్‌జీ వేరియంట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

స్విఫ్ట్ సీఎన్‌జీ కారు 5700 ఆర్‌పీఎం వద్ద 69 బీహెచ్‌పీ, 2900 ఆర్‌పీఎం వద్ద 101.8 ఎన్‌ఎం టార్క్ అవుట్‌పుట్‌తో వస్తుంది. 1.2 లీటర్ 3-సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అలాగే కిలో సీఎన్‌జీకు 32.85 కిమీ మైలేజీని అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే ఈ కారు ఆరు శాతం తక్కువ నిర్వహణ వ్యయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారు గురుంచి మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ  2025 ఆర్థిక సంవత్సరంలో జరిగే అమ్మకాల్లో సీఎన్జీ వాహనాల వాటా 33 శాతంగా ఉంటుందని చెప్పారు.

 స్విఫ్ట్ సీఎన్‌జీ డెలివరీలు సెప్టెంబర్ 14 నుంచి గుజరాత్ నుండి ప్రారంభమవుతాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకి 4.77 లక్షల సీఎన్‌జీ వాహనాలను విక్రయించింది. అలాగే 2025 ఆర్థిక సంవత్సరంలో 6 లక్షల యూనిట్లను లక్ష్యంగా పెట్టుకుంది. స్విఫ్ట్ సీఎన్‌జీ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ప్లస్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్, వైర్‌లెస్ ఛార్జర్, 60: 40 స్ప్లిట్ రియర్ సీట్లు, కనెక్టెడ్ టెక్నాలజీతో కూడిన 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. స్విఫ్ట్  సీఎన్‌జీ మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. వీ, వీ(ఓ), జెడ్ వేరియంట్స్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. స్విఫ్ట్ సీఎన్‌జీ కారు ప్రారంభ ధర రూ. 8.20 లక్షల నుంచి రూ. 9.20 లక్షల వరకు ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..