AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CNG Cars: సీఎన్‌జీ కారు కొంటున్నారా..? ఈ టిప్స్ పాటించకపోతే ఇక అంతే..!

ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడుతున్నా భారతదేశంలో మాత్రం సీఎన్‌జీతో నడిచే వాహనాలకు డిమాండ్ పెరిగింది. సీఎన్‌జీ అనేది పర్యావరణ అనుకూలమైన, తక్కువ ఖర్చుతో లభించే ఇంధనం. ముఖ్యంగా కారు కొనుగోలుదారులు సీఎన్‌జీ వాహనాలను ఇష్టపడుతూ ఉంటారు.  సీఎన్‌జీ ఆధారిత కార్లు మెరుగైన మైలేజీని అందించడమే కాకుండా ఇంధన ఖర్చులను ఆదా చేయడంలో సహాయపడతాయి.

CNG Cars: సీఎన్‌జీ కారు కొంటున్నారా..? ఈ టిప్స్ పాటించకపోతే ఇక అంతే..!
Cng Cars
Nikhil
|

Updated on: Sep 12, 2024 | 6:45 PM

Share

ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడుతున్నా భారతదేశంలో మాత్రం సీఎన్‌జీతో నడిచే వాహనాలకు డిమాండ్ పెరిగింది. సీఎన్‌జీ అనేది పర్యావరణ అనుకూలమైన, తక్కువ ఖర్చుతో లభించే ఇంధనం. ముఖ్యంగా కారు కొనుగోలుదారులు సీఎన్‌జీ వాహనాలను ఇష్టపడుతూ ఉంటారు.  సీఎన్‌జీ ఆధారిత కార్లు మెరుగైన మైలేజీని అందించడమే కాకుండా ఇంధన ఖర్చులను ఆదా చేయడంలో సహాయపడతాయి. ఈ హైబ్రిడ్ కార్లు పెట్రోల్, సీఎన్‌జీ రెండు ఇంధనాలతో నడుస్తాయి. పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. అయితే సీఎన్‌జీ కారు నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సీఎన్‌జీ సిలిండర్ లేదా ఇంధన లైన్ నుండి ఒక చిన్న లీక్ కూడా తీవ్రమైన ప్రమాదాలకు దారి తీస్తుంది. కాబట్టి సీఎన్‌జీ కార్లను నిర్వహించడం చాలా కీలకం. ఈ నేపథ్యంలో సీఎన్‌జీ కార్ల నిర్వహణలో నిపుణులు తెలిపే టిప్స్‌ను ఓ సారి తెలుసుకుందాం. 

నీడలో పార్క్ చేయడం

మీ సీఎన్‌జీ కారును నీడ ఉన్న ప్రదేశంలో లేదా గ్యారేజీలో పార్కింగ్ చేయడం చాలా ముఖ్యం. ప్రత్యక్ష సూర్యకాంతికి ఎక్కువసేపు గురికాకుండా ఉంచితే ప్రమాదాలను నివారించవచ్చు. ఎందుకంటే మండే వేడి సీఎన్‌జీ ట్యాంక్ జీవితకాలాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే క్యాబిన్ ఉష్ణోగ్రతను పెంచుతుంది.

స్పార్క్ ప్లగ్‌ల తనిఖీ 

మీ కారు ఇంజిన్‌లోని దహన ప్రక్రియకు స్పార్క్ ప్లగ్‌లు చాలా ముఖ్యమైనవి. వాటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయడంతో పాటు అవసరమైనప్పుడు వాటిని భర్తీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ వాహనం కోసం స్పార్క్ ప్లగ్‌లను ఎంచుకున్నప్పుడు మీరు ఎల్లప్పుడూ అధిక-నాణ్యత, సీఎన్‌జీ-అనుకూలమైన, అమర్చిన సీఎన్‌జీ స్పార్క్ ప్లగ్‌ని ఎంచుకోవాలి. అలాగే ప్రతి 10,000 కిమీ లేదా ఆరు నెలలకోసారి దాన్ని మార్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

థొరెటల్ బాడీని శుభ్రం చేయడం

థొరెటల్ బాడీ ఎయిర్ ఫిల్టర్‌ను ఇన్‌టేక్ మానిఫోల్డ్‌కి కలుపుతుంది. డర్టీ థొరెటల్ బాడీ ఇంజిన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. దహన సమయంలో గాలిని మృదువుగా తీసుకోవాలంటే దాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. 

సీఎన్‌జీ ట్యాంక్‌ తనిఖీ 

భద్రత కోసం అధీకృత సేవా సౌకర్యం ద్వారా సీఎన్‌జీ ట్యాంక్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం తప్పనిసరి. నష్టాలు, తుప్పు, పగుళ్ల ఏమైనా ఉన్నాయో? ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం ఉత్తమం. ముఖ్యంగా ట్యాంక్ గడువు తేదీని ఎల్లప్పుడూ ధ్రువీకరించుకోవాలి. అవసరమైన విధంగా దాన్ని భర్తీ చేయాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..