New Electric Scooter: ఆ ఇటాలియన్ దిగ్గజం మళ్లీ వచ్చేస్తోంది.. ఎలక్ట్రిక్ వేరియంట్.. స్టైలిష్ లుక్‌లో కేకపెట్టిస్తోంది..

| Edited By: Ram Naramaneni

Nov 12, 2023 | 9:42 PM

అయితే ప్రస్తుతం టూ వీలర్ మార్కెట్ అంతా ఎలక్ట్రిక్ బాట పడుతున్న తరుణంలో పాత కాలపు వాహనాలన్నీ కొత్త ఎలక్ట్రిక్ లుక్లో మార్కెట్లోకి వస్తున్న ట్రెండ్ మనం చూస్తున్నాం కదా. అదే క్రమంలో ఆ బ్రాండ్.. దాని పేరు చెప్పలేదు కదా.. అదేనండి 1960, 1970లలో మన దేశం ఓ వెలుగు వెలిగిన లాంబ్రెట్టా. ఇది ఇటాలియన్ బ్రాండ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్లో రానుంది. ఈఐసీఎంఏ 2023లో దీనికి సంబంధించిన ప్రోటో టైప్ ను ఆవిష్కరించింది.

New Electric Scooter: ఆ ఇటాలియన్ దిగ్గజం మళ్లీ వచ్చేస్తోంది.. ఎలక్ట్రిక్ వేరియంట్.. స్టైలిష్ లుక్‌లో కేకపెట్టిస్తోంది..
Lambretta Elettraa Electric Scooter
Follow us on

ఒకప్పుడు ఆ బ్రాండ్.. మన దేశంలో క్రేజీ బ్రాండ్. అత్యంత జనాదరణ పొందింది. టూ వీలర్ సెగ్మెంట్ లో తిరుగులేని విధంగా రోడ్లపై చక్కర్లుకొట్టేది. ఆ తర్వాత కాలంలో ఆ బ్రాండ్ కనుమరుగైంది. అయితే ప్రస్తుతం టూ వీలర్ మార్కెట్ అంతా ఎలక్ట్రిక్ బాట పడుతున్న తరుణంలో పాత కాలపు వాహనాలన్నీ కొత్త ఎలక్ట్రిక్ లుక్లో మార్కెట్లోకి వస్తున్న ట్రెండ్ మనం చూస్తున్నాం కదా. అదే క్రమంలో ఆ బ్రాండ్.. దాని పేరు చెప్పలేదు కదా.. అదేనండి 1960, 1970లలో మన దేశం ఓ వెలుగు వెలిగిన లాంబ్రెట్టా. ఇది ఇటాలియన్ బ్రాండ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్లో రానుంది. ఈఐసీఎంఏ 2023లో దీనికి సంబంధించిన ప్రోటో టైప్ ను ఆవిష్కరించింది. దీనికి ఎలెట్రా అనే పేరు పెట్టింది. ఈ ఎలెట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

లాంబ్రెట్టా ఎలెట్రా లుక్ అండ్ డిజైన్..

లాంబ్రెట్టా ఇప్పటికే ఒక కాన్సెప్ట్ ను పరిచయం చేసింది. దీనినే ఉత్పత్తి దశకు తీసుకెళ్తుందని చెబుతోంది. దీని లుక్, డిజైన్ ఎక్కువగా లాంబ్రెట్టా 1, ఎల్ఐ 150 సిరిస్ 2 స్కూటర్ల మాదిరిగానే ఉంటుంది. అదే సిగ్నేచర్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. హెడ్ లైట్ లో మాత్రమే హెక్సాగొనల్ లుక్ లో తీసుకొచ్చారు. ఇతర విజువల్ హైలైట్‌లలో ‘హుక్డ్’ హెడ్‌ల్యాంప్,’రిట్రాక్టబుల్’ బ్రేక్ లివర్‌లను దాచిపెట్టే హ్యాండిల్ బార్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఉన్నాయి. రిమోట్ బటన్‌ సాయంతో మెయింటెనెన్స్ సులభతరం చేస్తారు. బ్యాటరీని కలిగి ఉన్న కంపార్ట్‌మెంట్‌కు యాక్సెస్ ఇస్తుంది.

స్పెసిఫికేషన్లు..

స్కూటర్‌కు శక్తినిచ్చేది 11కేడబ్ల్యూ (15 హెచ్పీ) ఎలక్ట్రిక్ మోటారు, ఇది 4.6 కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్ నుంచి శక్తిని పొందుతుంది. ఆఫర్‌లో మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. అవి ఎకో, రైడ్, స్పోర్ట్ మోడ్లు. ఎకో మోడ్‌లో ఒక్కసారి చార్జింగ్ చేస్తే 127 కిలోమీటర్ల గరిష్ట పరిధిని ఎలెట్ట్రా అందించగలదని లాంబ్రెట్టా పేర్కొంది. పనితీరు విషయానికొస్తే, ఎలెట్రా గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. 220వోల్టుల హోమ్ చార్జర్‌తో బ్యాటరీని 5 గంటల 30 నిమిషాలలోపు ఫుల్ చార్జ్ చేయవచ్చు. పబ్లిక్ ప్లేస్‌లో ఫాస్ట్ చార్జర్‌ని ఉపయోగించడం ద్వారా, కేవలం 35 నిమిషాల్లో 80% వరకు చార్జ్ చేయవచ్చు. స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించబడిన ఎలెట్ట్రా సిగ్నేచర్ ట్రైలింగ్ లింక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక వైపున మోనో-షాక్‌పై కూర్చుంది. బ్రేకింగ్ విధులు రెండు చివర్లలో ఒకే డిస్క్ సెటప్ ద్వారా నిర్వహించబడతాయి. సౌకర్యవంతమైన 780ఎంఎం వద్ద సీటు ఎత్తు అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..