KTM 390: త్వరపడండి.! కనీవినీ ఎరగని ఆఫర్.. ఏకంగా రూ. 58 వేలు తగ్గింపు..

బైక్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. ప్రముఖ స్పోర్ట్స్ బైక్ తయారీ సంస్థ కేటీఎం నుంచి కొత్త మోడల్ మార్కెట్‌లోకి వచ్చేసింది.

KTM 390: త్వరపడండి.! కనీవినీ ఎరగని ఆఫర్.. ఏకంగా రూ. 58 వేలు తగ్గింపు..
Ktm Bike

Updated on: Apr 15, 2023 | 7:03 PM

స్పోర్ట్స్ బైక్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. ప్రముఖ స్పోర్ట్స్ బైక్ తయారీ సంస్థ కేటీఎం నుంచి కొత్త మోడల్ మార్కెట్‌లోకి వచ్చేసింది. కేటీఎం 390 అడ్వెంచర్ ఎక్స్ మోడల్ పేరుతో వచ్చిన ఈ బైక్.. సోల్ వేరియంట్ కంటే రూ. 58 వేల తగ్గింపుతో లభిస్తోంది. దీని ధర రూ. 2.8 లక్షలు(ఢిల్లీ, ఎక్స్-షోరూమ్).

అనువైన ధరకు కేటీఎం బైకులు మరింత మందికి చేరువయ్యేలా.. సదరు సంస్థ కొత్త మోడల్‌లో కొన్ని ఫీచర్లను తొలగించింది. అందులో ట్రాక్షన్ కంట్రోల్, రైడ్-బై-వైర్, క్విక్ షిఫ్టర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ మోటార్‌సైకిల్ వెనుక చక్రాలకు డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్‌ ఉంది.

ఈ ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లో 373.2 cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ అమర్చబడి ఉంది. ఇది 9,000 rpm వద్ద 43.5 PS గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 7,500 rpm వద్ద 37 Nm గరిష్ట టార్క్‌ను 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేస్తుంది. అలాగే రేర్ వీల్స్‌కు 10-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ కూడా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి