Komaki EV Scooter: మార్కెట్‌లో మరో కొత్త ఈవీ స్కూటర్ రిలీజ్ చేసిన కొమాకి.. ధర ఎంతో తెలుసా?
ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్ తన కొమాకి ఎస్‌ఈ సిరీస్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ మూడు కొత్త మోడల్స్ ఎస్ఈ ప్రో, ఎస్ఈ అల్ట్రా, ఎస్ఈ మ్యాక్స్ స్కూటర్లను రిలీజ్ చేసింది. ఈ స్కూటర్ ధరలు వరుసగా రూ.67,999, రూ.76,999, రూ.1,10,000 ఎక్స్- షోరూమ్ ధరతో పరిచయం చేసింది. అయితే ఈ మూడు మోడళ్లూ కొమాకి ఎంజీ ప్రో ఆధారంగా రూపొందించారు.

కొమాకి ఎస్ఈ అల్ట్రా, ఎస్ఈ మ్యాక్స్ ఫీచర్లు ఎల్ఐపీఓ4 బ్యాటరీ సాంకేతికతతో పని చేస్తుంది. ఇది అధిక సామర్థ్యం ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీ కారణంగా మెరుగైన శ్రేణిని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొమాకి ఎస్ఈ అల్ట్రా 2.7 కేడబ్ల్యూ ఎల్ఐపీఓ4 బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ 130-140 కిమీ పరిధిని ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కొమాకి ఎస్ఈ మ్యాక్స్ 4.2 కేడబ్ల్యూ ఎల్ఐపీఓ4 బ్యాటరీతో రావడంతో 200 పరిధిని అందిస్తుందని వివరిస్తున్నారు. కొమాకి ఎస్ఈ మ్యాక్స్ గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఫీచర్ల పరంగా ఇది డ్యూయల్ ఛార్జర్లు, టీఎఫ్‌టీ స్క్రీన్లు, డ్యూయల్ డిస్క్‌లతో ఆకట్టుకుంటుంది. కొమాకి ఎస్ఈ శ్రేణిలో ఎస్ఈ ప్రో, ఎస్ఈ స్కూటర్లు సింగిల్ డిస్క్, ఎల్ఈడీ డిజిటల్ స్పీడోమీటర్, 70 కిమీ గరిష్ట వేగంతో దూసుకుపోతాయి.
కొమాకికు సంబంధించిన ఎంజీ ప్రో 2024లో ప్రారంభించారు. కొమాకి ఎంజీ ప్రో లిథియం సిరీస్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎంజీ ప్రో ఎల్ఐ, ఎంజీ ప్రో వీ, ఎంజీ ప్రో ప్లస్ కొనుగోలుకు సిద్ధంగా ఉంటాయి. తక్కువ స్పీడ్ ఎల్ఐ వేరియంట్ 1.75 కేడబ్ల్యూ కెపాసిటీతో 75 కిమీపరిధిని అందిస్తుంది. ఎంజీ ప్రో వీ 100 కిమీ పరిధిని అందించే 2.2 కేడబ్ల్యూ బ్యాటరీతో వస్తుంది. అయితే ఎంజీ ప్రో ప్లస్ వేరియంట్ 2.7 కేడబ్ల్యూ బ్యాటరీతోో 150 కిమీ మైలేజ్ వస్తుంది అయితే ఈ మూడు వేరియంట్ స్కూటర్లు 4 నుంచి 5 గంటలలోపు బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అధునాతన రీజెన్, పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్లో కూడిన వైర్‌లెస్ కంట్రోలర్‌తో సహా అనేక ఫీచర్లతో వస్తుంది. ఈ స్కూటర్ మోటారు బీఎల్‌డీసీ హబ్-మౌంటెడ్ యూనిట్‌తో వస్తుంది. డిజిటల్ మ్యాట్రిక్స్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు వైర్లెస్ అప్డేట్ చేసే సామర్థ్యం ఈ స్కూటర్ ప్రత్యేకత. లాక్ బై రిమోట్ ఫంక్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రి పేర్ స్విచ్, టెలిస్కోపిక్ షాకర్, సెల్ఫ్ డయాగ్నసిస్, యాంటీ థెఫ్ట్ లాక్, మొబైల్ ఛార్జింగ్ స్లాట్‌తో సహా కొన్ని అదనపు ఫీచర్లు ఈ-స్కూటర్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



