AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Private Train: పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు సర్వీస్‌.. ట్రిప్‌లో అద్భుతమైన ప్రదేశాలు

రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని పలు సేవలను ప్రవేశపెడుతోంది. భారతీయ రైల్వేలు భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. SRMPR కేరళలో పర్యాటక సేవలను నిర్వహించడానికి ఒక రైలును..

Private Train: పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు సర్వీస్‌.. ట్రిప్‌లో అద్భుతమైన ప్రదేశాలు
Train
Subhash Goud
|

Updated on: May 07, 2024 | 1:56 PM

Share

రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని పలు సేవలను ప్రవేశపెడుతోంది. భారతీయ రైల్వేలు భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. SRMPR కేరళలో పర్యాటక సేవలను నిర్వహించడానికి ఒక రైలును లీజుకు తీసుకుంది. ఎస్‌ఆర్‌ఎంపీఆర్‌ రైలు, దాని సౌకర్యాలను నిర్వహిస్తుండగా, ప్రిన్సి ట్రావెల్స్ టికెటింగ్, మార్కెటింగ్ బాధ్యతలను తీసుకుంటుందని ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ డైరెక్టర్ దేవికా మీనన్ వివరించారు. ప్రారంభ ప్రయాణం గోవా వరకు ఉంటుంది. ముంబై – అయోధ్యలో షెడ్యూల్ స్టాప్‌లు ఉంటాయి. త్రివేండ్రం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్‌తో సహా పలు స్టేషన్‌ల నుండి ప్రయాణికులు వెళ్లవచ్చు.

750 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ రైలులో 2 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లు, 2 సెకండ్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. వైద్య నిపుణులతో సహా 60 మంది సిబ్బందితో కూడిన బృందం ప్రయాణీకుల సౌకర్యం, భద్రతను కల్పిస్తుంది. అలాగే ఆహారం, వైఫై, జీపీఎస్‌ ట్రాకింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. టూర్ ప్యాకేజీలతో స్టార్ హోటల్ బసలు, భోజనం, సందర్శనా స్థలాలు ఉన్నాయి. నాన్-ఎసి స్లీపర్‌లో గోవాకు 4 రోజుల పర్యటన కోసం ఛార్జీ రూ. 13,999. 3-టైర్ ఏసీని ఎంచుకోవడం వల్ల ఛార్జీ రూ.15,150 పెరుగుతుంది. 2-టైర్ ఏసీ ధర రూ. 16,400. అదేవిధంగా ముంబై ట్రిప్ కోసం ఛార్జీలు వరుసగా రూ. 15,050, రూ. 16,920, రూ. రూ.18,825.

అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లోని మతపరమైన ప్రదేశాలను కవర్ చేస్తూ 8 రోజుల పాటు సాగే అయోధ్య విహారయాత్ర నాన్-ఎసి స్లీపర్, 3-టైర్ ఎసి, 2-టైర్ ఎసికి వరుసగా రూ. 30,550, రూ.33,850. రూ.37,150. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే 5 నుండి 10 సంవత్సరాల వయస్సు గల వారు పెద్దల ఛార్జీలో సగం చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి