
Jio Plan: రిలయన్స్ జియో ఇటీవల తన అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అప్‌డేట్ చేసింది. అనేక రకాల కొత్త కొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. వినియోగదారులకు సరసమైన ధరకు రీఛార్జ్ ప్లాలను అందిస్తుంది. ఇటీవల జియో తన దీర్ఘకాలిక చెల్లుబాటు ప్లాన్‌లను కూడా అప్‌డేట్ చేసింది. ఈ రోజు జియో నుండి వచ్చిన ప్రత్యేక 365-రోజుల ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇది ఒకే రీఛార్జ్‌తో ఏడాది పొడవునా వినియోగదారులను అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది.
జియో తన దీర్ఘకాలిక చెల్లుబాటు ప్లాన్లలో తన కస్టమర్ల కోసం ఒక ప్రత్యేకమైన ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. దీనిని MyJio యాప్ ద్వారా లేదా అధికారిక Jio వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ధర రూ.3599. ఇందులో కంపెనీ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మొదటిది దీని చెల్లుబాటు పూర్తి 365 రోజులు. కంపెనీ రోజుకు 2.5GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ కింద కంపెనీ చెల్లుబాటు వ్యవధి వరకు మొత్తం 912.5GB డేటాను అందిస్తుంది. ఇది వినియోగదారు అన్ని ఇంటర్నెట్ అవసరాలను తీరుస్తుంది.
ఇది కూడా చదవండి: Home Remedies: మీ ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఇలా చేశారంటే చిటికెలో మటుమాయం
ఉచిత ప్రయోజనాలు:
జియో రూ. 3599 ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్లాన్. ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. కంపెనీ రోజుకు 100 SMS సందేశాలను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ కొత్త కనెక్షన్లతో అందుబాటులో ఉన్న JioHome రెండు నెలల ఉచిత ట్రయల్‌తో సహా అనేక ఇతర ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. JioHotstar కు మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితం. ఇంకా ఈ ప్లాన్‌లో 50GB ఉచిత JioAiCloud స్టోరేజీ కూడా ఉంది.
ప్రో గూగుల్ జెమిని ఉచిత యాక్సెస్:
ఈ ప్లాన్ కు కంపెనీ మరో ప్రత్యేక ప్రయోజనాన్ని కూడా జోడించింది. రీఛార్జ్ ప్లాన్ లో ప్రో గూగుల్ జెమిని ఫ్రీ. దీని ధర రూ. 35100. ఈ ప్లాన్ 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వినియోగదారుల కోసం. అందువల్ల జియో రూ. 3599 ప్లాన్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్లాన్ గురించి మరింత సమాచారం కోసం మీరు జియో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఇది కూడా చదవండి: Relationship Tips: మీ భార్య మీతో గొడవపడి అలిగిందా? ఇలా చేస్తే వెంటనే కూల్ అయిపోతారు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి