జియో భారతదేశంలో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జియో ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌లపై ఈ ఆఫర్ అందిస్తోంది. Jio వినియోగదారులు ఈ ఆఫర్‌ను 5 సెప్టెంబర్ నుండి 10 సెప్టెంబర్ 2024 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఆఫర్ ఇస్తున్న రీఛార్జ్ ప్లాన్‌లలో రూ. 899, రూ. 999, రూ. 3599 ప్లాన్‌లు ఉన్నాయి. మీరు జియో యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే అందులో వార్షిక ప్లాన్ అనే ఆఫర్‌ను కూడా చూడవచ్చు.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు పండగే.. విద్యాసంస్థలకు వరుస సెలవులు
ఈ మూడు ప్లాన్‌ల రీఛార్జ్‌పై, 28 రోజుల పాటు 10 OTT యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే, 10 GB ఉచిత డేటాను అందిస్తోంది. దీని ధర దాదాపు రూ. 175. ఇది కాకుండా, Zomato గోల్డ్ సభ్యత్వం 3 నెలల పాటు లభిస్తుంది. అలాగే, రూ. 500 విలువైన AJIO వోచర్‌లు అందుకుంటారు. అయితే దీని కోసం మీరు రూ. 2999 లేదా అంతకంటే ఎక్కువ షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మూడు రీఛార్జ్‌లపై కస్టమర్లు దాదాపు రూ.700 ఉచిత ప్రయోజనాలను పొందవచ్చని జియో పేర్కొంది.
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 18వ విడత డబ్బులు ఎప్పుడో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి