ప్రస్తుతం ద్విచక్ర వాహనాల మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల ట్రెండ్ కొనసాగుతుంది. అని టాప్ కంపెనీలు కూడా తమ ఈ-బైక్ వెర్షన్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే వాటి ధర మాత్రం మధ్య తరగతి వాళ్లకు కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లలో వినియోగదారుల అభిమానాన్ని దోచుకున్న ఓలా, టీవీఎస్ కంపెనీల స్కూటర్ల కంటే కొన్ని స్కూటర్లు తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే ప్రచారంలో మాత్రం లేకపోవడంతో సగటు వినియోగదారుడికి ఆ స్కూటర్ల గురించి తెలియడం లేదు. ఇవూమి అనే స్కూటర్ మంచి ఫీచర్లతో అందుబాటులో ధరలో ఉందని మీకు తెలుసా? బడ్జెట్ సెగ్మెంట్ కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేసింది. ఇందులో మీకు శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. దీని కారణంగా ఇది మరింత డ్రైవ్ పరిధి వస్తుంది. అలాగే ఈ స్కూటర్ లో అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేద్దాం అనుకునే వారు ఈ స్కూటర్ గురించి కూడా ఓ సారి తెలుసుకోండి.
ఈ స్కూటర్ కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్ స్కూటర్. ఈ స్కూటర్ లో 60 వీ, 35 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడానికి 250 డబ్ల్యూ మోటార్ కూడా ఉంది. ఈ స్కూటర్ ను సాధరణంగా చార్జర్ సహాయంతో చార్జ్ చేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది.
ఈ స్కూటర్ ఓ సారి ఫుల్ గా చార్జ్ చేస్తే గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ఈ స్కూటర్ ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. అల్లాయ్ వీల్స్ తో పాటు ట్యూబ్ లెస్ టైర్లు ఈ స్కూటర్ ప్రత్యేకత.
ఇవూమి స్కూటర్ లో అత్యాధునిక ఫీచర్లను గమనించవచ్చు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ స్పీడోమీటర్, పుష్ బటన్ స్టార్ట్, డిజిటల్ ట్రిప్ మీటర్, యాంటీ థెఫ్ట్ అలారం, యూఎస్ బీ ఛార్జింగ్ పోర్ట్, కీలెస్ ఆపరేషన్, పార్కింగ్ స్విచ్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, ఎల్ఈడీ హెడ్ లైట్, ఎల్ఈడీ డీఆర్, రివర్స్ అసిస్ట్ ఉన్నాయి. అలాగే భారతీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.81,499గా ఉంది. అయితే ఆన్ రోడ్ ప్రైస్ మాత్రం రూ. 85,287 వరకూ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..