ITR Filing Deadline: ఈ వ్యక్తులు గడువు తర్వాత కూడా పెనాల్టీ లేకుండా పన్ను చెల్లించవచ్చు!

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయం కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి గడువు పొడిగిస్తారని చాలా మంది ఎదురు చూశారు. కానీ అలాంటి పొడిగింపు ఏమి జరగలేదు. ఐటీర్‌ ఫైల్‌ కోసం చివరి గడువు జూలై 31తో ముగిసింది. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు ఆలస్యంగా ఆదాయపు పన్ను (ఆలస్యమైన ఐటీఆర్) చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే..

ITR Filing Deadline: ఈ వ్యక్తులు గడువు తర్వాత కూడా పెనాల్టీ లేకుండా పన్ను చెల్లించవచ్చు!
Itr
Follow us
Subhash Goud

|

Updated on: Aug 01, 2024 | 11:52 AM

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయం కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి గడువు పొడిగిస్తారని చాలా మంది ఎదురు చూశారు. కానీ అలాంటి పొడిగింపు ఏమి జరగలేదు. ఐటీర్‌ ఫైల్‌ కోసం చివరి గడువు జూలై 31తో ముగిసింది. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు ఆలస్యంగా ఆదాయపు పన్ను (ఆలస్యమైన ఐటీఆర్) చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే గడువు దాటిపోతున్నా ఆందోళన చెందని వారు కొందరున్నారు. ఈ వ్యక్తులు ఇప్పటికీ జరిమానా లేకుండా ITR ఫైల్ చేయవచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి. ఆలస్యమైన ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31. కానీ ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసిన వారికి శాఖ వడ్డీ చెల్లించదు. సమయానికి ఐటీఆర్‌ ఫైల్ చేసిన తర్వాత పన్ను చెల్లింపుదారుడు రీఫండ్ మొత్తంపై నెలకు 0.5% చొప్పున వడ్డీని పొందుతారని గమనించండి.

ఇది కూడా చదవండి: AP News: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. ఇది కదా కావాల్సింది!

ఎంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది?

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, గడువు తేదీ తర్వాత ఐటీఆర్‌ను ఫైల్ చేయడానికి రూ. 5,000 వరకు ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే ఆలస్య రుసుంగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ వ్యక్తులు ఇప్పటికీ జరిమానా లేకుండా ఐటీఆర్‌ ఫైల్ చేయవచ్చు:

ఖాతాలను ఆడిట్ చేయాల్సిన వ్యాపారవేత్తలు లేదా వ్యక్తుల కోసం, ITR ఫైల్ చేయడానికి గడువు భిన్నంగా ఉంటుంది. ఈ వ్యక్తులు అక్టోబర్ 31 వరకు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. వారికి ఆదాయపు పన్ను శాఖ అదనంగా 3 నెలల సమయం ఇస్తుంది. తద్వారా వారు గుర్తింపు పొందిన CA ద్వారా ఖాతాను ఆడిట్ చేసి, ఆపై వారి ITR ఫైల్ చేయవచ్చు.

వారు నవంబర్ 30 వరకు జరిమానా లేకుండా ఐటీఆర్‌ ఫైల్

కొన్ని రకాల లావాదేవీల కోసం ఐటీఆర్‌ ఫైల్ చేయడంలో మినహాయింపు కూడా ఉంటుంది. ఒక వ్యాపారం దాని అంతర్జాతీయ లావాదేవీలలో బదిలీకి సంబంధించి నివేదికను ఫైల్ చేయవలసి వస్తే, అటువంటి వ్యాపారాలకు ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి అదనపు సమయం ఇస్తారు. అలాంటి వ్యక్తులు నవంబర్ 30 వరకు తమ రిటర్నులను దాఖలు చేయవచ్చు. అంతర్జాతీయ లావాదేవీలే కాకుండా, కొన్ని రకాల దేశీయ లావాదేవీలలో కూడా ఇటువంటి మినహాయింపు అందిస్తుంది ఇన్‌కమ్‌ ట్యాక్స్‌.

ఇది కూడా చదవండి: LPG Gas Prices: గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. పెరిగిన సిలిండర్‌ ధర.. ఎంతో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి