FD Interest Rates: ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై వడ్డీల జాతర.. పన్ను ఆదాతో పాటు బోలెడన్ని ఆఫర్లు..
2023–24 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆదా చేయడానికి మార్చి 31, 2023లోపు పెట్టుబడులు పెట్టారు. చాలా మంది యజమానులు లేదా కంపెనీలు జనవరి లేదా ఫిబ్రవరిలో పెట్టుబడి ప్రకటనల కోసం అడుగుతారు. అవాంతరాలు, చివరి నిమిషంలో తప్పుడు పెట్టుబడి నిర్ణయాలను నివారించడానికి ఒకరు తమ ఆర్థిక పరిస్థితులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్‌ఎస్)తో పాటు వివిధ పన్ను ఆదా చేసే ఎఫ్‌డీల్లో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా చేయవచ్చు.

పెట్టుబడిదారులు పన్ను ఆదాతో పాటు మంచి రాబడి కోసం చూస్తుంటే మీరు కచ్చితంగా ట్యాక్స్‌సేవర్ ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలి. ఈ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు పొందుతారు. కొన్ని బ్యాంకులు ప్రస్తుతం పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై భారీ వడ్డీని అందిస్తున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆదా చేయడానికి మార్చి 31, 2023లోపు పెట్టుబడులు పెట్టారు. చాలా మంది యజమానులు లేదా కంపెనీలు జనవరి లేదా ఫిబ్రవరిలో పెట్టుబడి ప్రకటనల కోసం అడుగుతారు. అవాంతరాలు, చివరి నిమిషంలో తప్పుడు పెట్టుబడి నిర్ణయాలను నివారించడానికి ఒకరు తమ ఆర్థిక పరిస్థితులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్‌ఎస్)తో పాటు వివిధ పన్ను ఆదా చేసే ఎఫ్‌డీల్లో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా చేయవచ్చు. ఇటీవలి నివేదిక ప్రకారం, కొన్ని బ్యాంకులు పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఆ బ్యాంకుల వివరాలేంటో? ఓ సారి తెలుసుకుందాం.
- ప్రస్తుతం పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకులు ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ మొదటి వరుసలో ఉంటాయి. ప్రస్తుతం, ఈ రెండు బ్యాంకుల్లో పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై 7.25 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఐదేళ్లలో ఇక్కడ పెట్టుబడి పెట్టిన రూ.1.5 లక్షలు రూ.2.15 లక్షలకు పెరుగుతాయి.
- దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై గణనీయమైన రాబడిని ఇస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఎవరైనా పన్ను ఆదా చేసే ఎఫ్‌డీ చేస్తే వారికి 7 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. అంటే ఇందులో ఇన్వెస్ట్ చేసిన రూ. 1.5 లక్షల మొత్తం ఐదేళ్లలో రూ.2.12 లక్షలు అవుతుంది.
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ పన్ను ఆదా చేసే ఎఫ్‌డీపై 6.7 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. ఈ రెండు ప్రభుత్వ బ్యాంకుల్లో ఐదేళ్ల పాటు రూ. 1.5 లక్షల ఎఫ్‌డీని మెయింటెయిన్ చేస్తే, మెచ్యూరిటీపై రూ.2.09 లక్షలు పొందుతారు.
- పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై ఫెడరల్ బ్యాంక్ 6.6 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఫెడరల్ బ్యాంక్ పన్ను ఆదా ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేసిన రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే ఐదేళ్లలో రూ.2.08 లక్షలకు పెరుగుతాయి.
- దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై 6.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ కూడా 6.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఐదేళ్లలో ఈ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టిన రూ.1.5 లక్షలు రూ.2.07 లక్షలకు పెరుగుతాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
