Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top Selling Cars: ఈ కార్లు.. హాట్ కేకులు.. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు ఇవే..

పండుగ సీజన్ రాకముందే మన దేశంలో ఆటో మొబైల్ పరిశ్రమ రికార్డు స్థాయి విక్రయాలను రాబట్టింది. 2023 సెప్టెంబర్ పెద్ద ఎత్తున కార్ల అమ్మకాలు జరిగాయి. వాటిల్లో ఎప్పటిలాగే మారుతి సుజుకీ కార్లు టాప్ ప్లేస్ లో ఉండగా.. ఆ తర్వాత టాటా కార్లు నిలిచాయి. టాప్ టెన్ లో ఏకంగా ఆరు మోడళ్లు కేవలం మారుతి సుజుకీ కార్లే ఉన్నాయంటే మన దేశంలో దాని ఆధిపత్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Top Selling Cars: ఈ కార్లు.. హాట్ కేకులు.. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు ఇవే..
Maruti Suzuki Baleno
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 11, 2023 | 9:41 PM

పండుగ సీజన్ రాకముందే మన దేశంలో ఆటో మొబైల్ పరిశ్రమ రికార్డు స్థాయి విక్రయాలను రాబట్టింది. 2023 సెప్టెంబర్ పెద్ద ఎత్తున కార్ల అమ్మకాలు జరిగాయి. వాటిల్లో ఎప్పటిలాగే మారుతి సుజుకీ కార్లు టాప్ ప్లేస్ లో ఉండగా.. ఆ తర్వాత టాటా కార్లు నిలిచాయి. టాప్ టెన్ లో ఏకంగా ఆరు మోడళ్లు కేవలం మారుతి సుజుకీ కార్లే ఉన్నాయంటే మన దేశంలో దాని ఆధిపత్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే పెద్ద కార్ల కంటే చిన్న కార్ల కొనుగోళ్లే అధికంగా జ రిగాయి. అయితే ఎస్ యూవీ కార్లు కూడా గణనీయమైన వృద్ధినే నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో అమ్ముడైన టాప్ 7 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతీ సుజుకి బాలెనో.. గతేడాది ప్రారంభమైన ఈ హ్యాచ్‌బ్యాక్, అమ్మకాల చార్ట్‌లో టాప్ ప్లేస్ లో నిలిచింది. అనేక ఫీచర్లతో కూడిన బాలెనో సెప్టెంబర్‌లో 18,417 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఈ సంఖ్య మునుపటి సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే దాదాపు ఐదు శాతం తగ్గుదలని సూచిస్తున్నప్పటికీ, ఎస్ యూవీలపై పెరుగుతున్న డిమాండ్ ను ఇది చాటి చెబుతోంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్.. ఇది మన దేశంలో ఓ హాట్ ఫేవరెట్ అని చొప్పొచ్చు. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ కారు ఏటా అమ్మకాల చార్ట్‌లో స్థిరంగా మొదటి నుంచి మూడు స్థానాల్లో ఏదోకొటి సాధిస్తుంది. సెప్టెంబరులో, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 16,250 యూనిట్ల అమ్మకాలను నివేదించింది. అయితే గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 20 శాతం క్షీణించింది.

ఇవి కూడా చదవండి

టాటా నెక్సాన్.. టాటా మోటార్స్ నుంచి వస్తున్న సబ్-కాంపాక్ట్ ఎస్ యూవీ నెక్సాన్ కూడా గణనీయమైన పురోగతిని సాధించింది, ఇది 15,325 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. సుమారు ఆరు శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఆప్షన్‌లతో సహా డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్‌లలో అప్‌డేట్‌లను సూచిస్తుంది. ఇక్కడ గమనించాల్సిదేమిటంటే నెక్సాన్ దాని ప్రాథమిక ప్రత్యర్థి బ్రెజ్జాను అధిగమించి మునుపటి నెలలో అమ్మకాలను సాధించింది.

మారుతి సుజుకి బ్రెజ్జా.. ఈ కారు సెప్టెంబర్‌లో, దేశవ్యాప్తంగా 15,001 యూనిట్లు విక్రయాలు నమోదు చేసింది. ఈ సంఖ్య, మునుపటి సంవత్సరం ఇదే నెల కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, యువ కొనుగోలుదారులకు ప్రాధాన్య ఎంపికగా బ్రెజ్జా స్థానాన్ని నిలుస్తోంది. మారుతి సుజుకి ప్రత్యేకంగా బ్రెజ్జాను పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సీఎన్జీ వేరియంట్లో అందుబాటులో ఉంచుతోంది.

మారుతీ సుజుకి స్విఫ్ట్.. ఈ హ్యాచ్‌బ్యాక్, సమీప భవిష్యత్తులో గణనీయమైన ఫేస్‌లిఫ్ట్‌కు గురయ్యే అవకాశం ఉంది. అమ్మకాల ర్యాంకింగ్స్‌లో క్షీణత కనిపించింది. మునుపటి సంవత్సరం సెప్టెంబర్‌తో పోలిస్తే అమ్మకాలలో చెప్పుకోదగ్గ 23 శాతం వృద్ధి ఉన్నప్పటికీ, గత నెలలో దేశవ్యాప్తంగా 14,703 యూనిట్లు అమ్ముడయ్యాయి.

మారుతి సుజుకి డిజైర్.. భారతదేశంలో నెలవారీ టాప్ 10 కార్ల విక్రయాల జాబితాలో స్థిరంగా కనిపించే ఏకైక సెడాన్‌ ఈ డిజైర్. మారుతి సీఎన్జీ సాంకేతికత కారణంగా డిజైర్ మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత నెలలో 13,880 యూనిట్లు అమ్ముడయ్యాయి, సెప్టెంబర్ 2022తో పోలిస్తే 45 శాతం పెరుగుదలతో, డిజైర్ 2016లో ప్రారంభించినప్పటి నుంచి పెద్దగా డిజైన్ మార్పులు లేకుండానే ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

మారుతీ సుజుకి ఎర్టిగా.. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మూడు-వరుసల ఎంపీవీగా ఎర్టిగా నిలుస్తోంది. గత నెలలో 13,528 యూనిట్ల విక్రయాలను నమోదయ్యాయి, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 45 శాతం పెరుగుదలను ఎర్టిగా నమోదు చేసింది. ఈ కారు కూడా పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..