AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar: ఈ ఒక్క నంబర్ సేవ్ చేస్తే చాలు.. ఆధార్ PDF మీ వాట్సాప్‌లో..

ఆధార్ కార్డు అనేది ప్రతి భారతీయుడికి ఒక ముఖ్యమైన పత్రం. దీన్ని పొందడానికి ఇంతవరకు అనేక ప్లాట్ ఫామ్ లలో లాగిన్ అవ్వాల్సి వచ్చేది. అయితే, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన మైగవ్ హెల్ప్ డెస్క్ చాట్ బాట్ తో ఈ ప్రక్రియ మరింత సులభం అయింది. ఇప్పుడు కేవలం మీ వాట్సాప్ ద్వారానే ఆధార్ కార్డు PDFను సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ పద్ధతి ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Aadhaar: ఈ ఒక్క నంబర్ సేవ్ చేస్తే చాలు.. ఆధార్ PDF మీ వాట్సాప్‌లో..
Aadhaar Pdf Directly On Whatsapp
Bhavani
|

Updated on: Sep 25, 2025 | 4:36 PM

Share

భారతీయ పౌరులు తమ ఆధార్ కార్డును ఇప్పుడు వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ విధానం వల్ల UIDAI పోర్టల్, డిజీ లాకర్ వంటి అనేక ప్లాట్ ఫామ్ లకు వెళ్ళవలసిన అవసరం లేదు. మైగవ్ హెల్ప్ డెస్క్ చాట్ బాట్ తో ఈ సేవ అనుసంధానం అయింది. ఈ సేవ పొందాలంటే మీ మొబైల్ నంబర్ ఆధార్ కు లింక్ అయి ఉండాలి. అలాగే మీ డిజీ లాకర్ ఖాతా కూడా దానికి అనుసంధానం కావాలి.

వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్ లోడ్ విధానం

నంబర్ సేవ్: MyGov హెల్ప్ డెస్క్ నంబర్ +91-9013151515 ను మీ కాంటాక్టులలో సేవ్ చేసుకోండి.

చాట్ ప్రారంభించండి: వాట్సాప్ ఓపెన్ చేసి మైగవ్ హెల్ప్ డెస్క్ కు “హాయ్” లేదా “నమస్తే” అని మెసేజ్ పంపించండి.

సేవ ఎంచుకోండి: మెనూ ఆప్షన్స్ లో డిజీ లాకర్ సేవలు ఎంచుకోవాలి. ఆ తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేసి మీ ఖాతాను ధృవీకరించాలి.

ఓటీపీ ధృవీకరణ: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేసి ప్రమాణీకరించాలి.

ఆధార్ డౌన్ లోడ్: ధృవీకరణ పూర్తయ్యాక, పత్రాల జాబితా నుండి ఆధార్ ను ఎంచుకోవాలి. మీ ఆధార్ కార్డు PDF ఫార్మాట్ లో వాట్సాప్ లోనే వస్తుంది.

ముఖ్యమైన విషయాలు

ఈ సేవ ఉపయోగించడానికి మీ ఆధార్ డిజీ లాకర్ తో లింక్ ఉండాలి. లేకపోతే, వాట్సాప్ ఉపయోగించే ముందు డిజీ లాకర్ వెబ్ సైట్ ద్వారా వివరాలు మార్చాలి.

చాట్ బాట్ ద్వారా ఒకేసారి ఒక పత్రాన్ని మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది.

ఈ పద్ధతి కోట్లమంది భారతీయులకు తమ ఆధార్, ఇతర పత్రాలను పొందడానికి వేగవంతమైన, సురక్షితమైన మార్గం అందిస్తుంది.

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..