Smart Phones: స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో ఇండియా రికార్డు.. ఆ కంపెనీ ఫోన్లే ఎక్కువ

భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలతో ఉత్పత్తి రంగం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ రంగంలో మెరుగదలతో ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి. సెల్ ఫోన్స్‌ తయారీ కేంద్రంగా చైనా ఉన్న విషయం తెలిసిందే. అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతులు అధికంగా ఉంటాయి. అయితే తాజాగా స్మార్ట్ ఫోన్స్ ఎగుమతులకు ఇండియా కూడా చైనాకు గట్టి పోటినిస్తుంది. నవంబర్‌లో భారీగా స్మార్ట్ ఫోన్స్ ఎగుమతి అయ్యాయి.

Smart Phones: స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో ఇండియా రికార్డు.. ఆ కంపెనీ ఫోన్లే ఎక్కువ
Follow us
Srinu

|

Updated on: Dec 17, 2024 | 3:07 PM

భారతదేశం నుంచి నవంబర్‌లో రికార్డు స్థాయిలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతి అయ్యాయి. ముఖ్యంగా రూ.20 వేల కోట్ల విలువైన ఆపిల్ కంపెనీకు సంబంధించిన ఫోన్లు ఎగుమతి అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల విడుదలైన డేటా ప్రకారంస్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రూ.20,300 కోట్లను దాటాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 90 శాతం ఎక్కువ. గత నెలలో యాపిల్ ఎగుమతుల్లో ముందుండగా శాంసంగ్ తర్వాతి స్థానంలో నిలిచింది. గతేడాది నవంబర్‌లో భారతదేశం నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రూ.10,600 కోట్లకు పైగా ఉన్నాయి. దేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సింగిల్ డిజిట్ వార్షిక వృద్ధి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడెక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం చాలా బాగా సక్సెస్ అయ్యిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యాపిల్ ఐ ఫోన్ ఉత్పత్తులు ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఏడు నెల కాలంలో 10 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. భారతదేశంలో గత ఆర్థిక సంవత్సరం 14 బిలియన్ల డాలర్ల విలువైన ఐఫోన్‌లను తయారు చేసింది. ఇందులో 10 బిలియన్ల డాలర్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. ప్రీమియం 5జీ, ఏఐ స్మార్ట్‌ఫోన్‌లకు ఇటీవల డిమాండ్ పెరిగిన కారణంగా ఈ సంవత్సరం భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 7 నుంచి 8 శాతం వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

భారతదేశంలో మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  2030 ఆర్థిక సంవత్సరం నాటికి 500 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీ లక్ష్యాన్ని సాధిస్తుందని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా 2030 నాటికి టాప్ ఎగుమతిదారుల్లో భారతదేశం ఒకటిగా ఉంటుందని చెబుతున్నారు. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ డేటా ప్రకారం మొబైల్ ఫోన్ ఉత్పత్తి 2014-15లో రూ.18,900 కోట్ల నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.4.10 లక్షల కోట్లకు పెరిగింది. పీఎల్ఐ పథకం ద్వారా 2,000 శాతం భారీ పెరుగుదలను నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో ఇండియా రికార్డు..!
స్మార్ట్ ఫోన్స్ ఎగుమతుల్లో ఇండియా రికార్డు..!
బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
ప్రభాస్ సినిమాకు నో చెప్పిన ఆ క్రేజీ హీరోయిన్! కారణమేంటో తెలుసా?
ప్రభాస్ సినిమాకు నో చెప్పిన ఆ క్రేజీ హీరోయిన్! కారణమేంటో తెలుసా?
దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు
దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు
మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
రైతులకు సులువుగా రుణాలు.. రూ.1000 కోట్లతో రుణ హామీ పథకం
రైతులకు సులువుగా రుణాలు.. రూ.1000 కోట్లతో రుణ హామీ పథకం
లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల SA 1 మ్యాథ్స్‌ పేపర్ లీక్!
లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల SA 1 మ్యాథ్స్‌ పేపర్ లీక్!
నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు..
నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు..
వామ్మో ఈ పాడు ఎలుకులు ఎంత పని చేశాయి..
వామ్మో ఈ పాడు ఎలుకులు ఎంత పని చేశాయి..
ఒక్క ముద్దు.. ఆమెకు మృత్యువు ముంచుకొచ్చేలా చేసింది..!ఏం జరిగిదంటే
ఒక్క ముద్దు.. ఆమెకు మృత్యువు ముంచుకొచ్చేలా చేసింది..!ఏం జరిగిదంటే