Forex Reserves: భారత ఆర్థిక వ్యవస్థకు షాక్.. ఏడాది కనిష్ఠ స్థాయికి పడిపోయిన విదేశీ మారక నిల్వలు

India Forex Reserves: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గణాంకాల మేరకు జులై 1 తేదీతో ముగిసిన వారానికి దేశంలోని విదేశీ మారక నిల్వలు 5.009 బిల్లియన్లు తగ్గి 588.314 బిల్లియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఏప్రిల్ తర్వాత విదేశీ మారక నిల్వలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి.

Forex Reserves: భారత ఆర్థిక వ్యవస్థకు షాక్.. ఏడాది కనిష్ఠ స్థాయికి పడిపోయిన విదేశీ మారక నిల్వలు
Forex Reserves (Representative Image)
Follow us

|

Updated on: Jul 09, 2022 | 10:53 AM

India’s foreign exchange reserves: భారత విదేశీ మారక నిల్వలు (ఫోరెక్స్) భారీగా తగ్గాయి. ఏకంగా 5 బిల్లియన్ డాలర్లు తగ్గిన ఫోరెక్స్ నిల్వలు.. గత ఏడాది కాలంలో అత్యంత కనిష్ఠ స్థాయికి చేరింది. డాలర్ విలువ పెరగడం, రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ లో స్థాయికి పడిపోవడం దీనికి కారణమవుతోంది. ఆర్థిక మాంద్యం భయాలతో భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు భారీ ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో రూపాయి విలువ తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజురోజుకూ క్షీణిస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గణాంకాల మేరకు జులై 1 తేదీతో ముగిసిన వారానికి దేశంలోని విదేశీ మారక నిల్వలు 5.009 బిల్లియన్లు తగ్గి 588.314 బిల్లియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఏప్రిల్ తర్వాత విదేశీ మారక నిల్వలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. జులై 1తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధానమైన కరెన్సీ నిల్వలు 4.47 బిలియన్ డాలర్లు తగ్గి 524.745 బిలియన్ డాలర్లకు చేరింది. ఆ తర్వాతటి స్థానంలోని బంగారం నిల్వలు 504 మిలియన్ డాలర్లు తగ్గి 40.422 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అనూహ్యంగా జూన్ 24తో ముగిసిన వారంలో మారక నిల్వలు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చాయి. ఆ వారంలో 2.734 బిలియన్ డాలర్లు పెరిగి 593.323 బిలియన్ డాలర్లకు చేరింది.

జూన్ 17తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 5.87 బిలియన్ డాలర్లు తగ్గి 590.588 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అంతకు ముందు మూడు వారాల పాటు మారక నిల్వలు ఏకంగా 10.785 బిలియన్ డాలర్లు తగ్గాయి.

అయితే రూపాయి మారక విలువ పతనంతో జులై 1తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు మళ్లీ క్షీణించడం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అంశం. మిగిలిన అన్ని కరెన్సీలపైనా అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. దీంతో విదేశీ మదుపర్లు విదేశీ స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని.. డాలర్‌‌ ప్రభావిత స్టాక్స్‌పై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..