AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani vs Ambani: వ్యాపార దిగ్గజాల మధ్య పోరు నెక్ట్స్‌ రేంజ్‌కి.. అంబానీని ఢీకొట్టనున్న అదానీ..

Adani Telecom: భారత టెలికం రంగంలో మరో సంచలనానికి నాంది పడనుంది. ప్రస్తుతం భారతీయ టెలికం రంగాన్ని ఏలుతోన్న అంబానీ, మిట్టల్‌ను ఢీకొట్టేందుకు వ్యాపర దిగ్గజం, అపర కుబేరుడు...

Adani vs Ambani: వ్యాపార దిగ్గజాల మధ్య పోరు నెక్ట్స్‌ రేంజ్‌కి.. అంబానీని ఢీకొట్టనున్న అదానీ..
Narender Vaitla
|

Updated on: Jul 09, 2022 | 11:24 AM

Share

Adani Telecom: భారత టెలికం రంగంలో మరో సంచలనానికి నాంది పడనుంది. ప్రస్తుతం భారతీయ టెలికం రంగాన్ని ఏలుతోన్న అంబానీ, మిట్టల్‌ను ఢీకొట్టేందుకు వ్యాపర దిగ్గజం, అపర కుబేరుడు గౌతమ్‌ అదానీ సిద్ధమవుతున్నారు. త్వరలో నిర్వహించనున్న 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొని టెలికం రంగంలోకి అడుగుపెట్టడానికి అదానీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అదానీ సంస్థ స్పెక్ట్రం వేలానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. స్పెక్ట్రమ్‌ వేలానికి ఏయే కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయన్నవివరాలు ఈ నెల 12న వెల్లడవుతాయి. ఇదిలా ఉంటే అదానీ గ్రూప్స్‌ ఇటీవల నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ (ఎన్‌ఎల్‌డీ), ఇంటర్నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ (ఐఎల్‌డీ) లైసెన్సులను పొందడంతో టెలికం రంగంలో అదానీ ఎంట్రీ కాన్ఫామ్‌ అనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. వివిధ బ్యాండ్లలో దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రం వేలం జులై 26న ప్రారంభం కానుంది.

ఒకవేళ అదానీ టెలికం రంగంలోకి అడుగుపెడితే ఈ రంగంలో పోటీ పెరిగే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏదు. గుజరాత్‌కు అంబానీ, అదానీలు ఇప్పటి వరకు ఒకే రంగంలో ఎన్నడూ పోటీ పడలేదు. ఇద్దరూ వారు ఎంచుకున్న రంగాల్లో భారీ వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించారు. అయితే తొలిసారి టెలికం రంగంతో ఈ పోటీ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మరి అదానీ ఎంట్రీతో టెలికం రంగంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..