MG Comet: భారతదేశంలో అతి తక్కువ ధరలో ఈవీ కారు లాంచ్.. వారే అసలు టార్గెట్..!

పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఇటీవల కాలంలో ఈవీ కార్లు కూడా ఇబ్బడి ముబ్బడి మార్కెట్‌లో రిలీజ్ అవుతున్నాయి. ఎన్ని కార్లు రిలీజ్ అయినా మొదట్లో కార్ల మైలేజ్ విషయంలో వెనుకడుగు వేసిన కస్టమర్లు తాజాగా వాటి ధరలు విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులు సాధారణంగా బడ్జెట్ కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే వారికి అందుబాటులో ఒక్క ఈవీ కారు మార్కెట్‌లో లేదు. అయితే తాజాగా ఓ కారు బడ్జెట్ ప్రియులకు అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రముఖ ఈవీ కంపెనీలకు సవాల్ విసురుతుంది.

MG Comet: భారతదేశంలో అతి తక్కువ ధరలో ఈవీ కారు లాంచ్.. వారే అసలు టార్గెట్..!
Mg Comet
Follow us
Srinu

|

Updated on: Jun 23, 2024 | 7:45 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి గణనీయంగా ఉంది. ఈ ఈవీ వాహనాల్లో కార్లతో పోలిస్తే ఈవీ స్కూటర్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఇటీవల కాలంలో ఈవీ కార్లు కూడా ఇబ్బడి ముబ్బడి మార్కెట్‌లో రిలీజ్ అవుతున్నాయి. ఎన్ని కార్లు రిలీజ్ అయినా మొదట్లో కార్ల మైలేజ్ విషయంలో వెనుకడుగు వేసిన కస్టమర్లు తాజాగా వాటి ధరలు విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులు సాధారణంగా బడ్జెట్ కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే వారికి అందుబాటులో ఒక్క ఈవీ కారు మార్కెట్‌లో లేదు. అయితే తాజాగా ఓ కారు బడ్జెట్ ప్రియులకు అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రముఖ ఈవీ కంపెనీలకు సవాల్ విసురుతుంది. ఎంజీ కామెట్ ఈవీ ధర రూ. 6.99 లక్షలతో నుంచి రూ. 9.53 లక్షల మధ్య లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎంజీ కామెట్ ఈవీ కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు 2024లో 4,493 యూనిట్ల అమ్మకాలను సాధించింది.  గత నెలలో 1,200 యూనిట్ల అమ్మకాలను సాధించిందంటే ఈ కారు ఆదరణను మనం అర్థం చేసుకోవచ్చు. ఎంజీ కామెట్ ఈవీ 42పీఎస్/110 ఎన్ఎం పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌తో వస్తుంది. ఈ కారు ఐపీ 67 రేటెడ్ అయిన 17.3 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 3.3 కేడబ్ల్యూ ఛార్జర్‌ని ఉపయోగించి 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 7 గంటలు పడుతుంది. 7.4 కేడబ్ల్యూ ఛార్జర్‌తో, 0-100 శాతం ఛార్జ్‌ను 3.5 గంటల్లో సాధించవచ్చు. ఎంజీ కామెట్ ఈవీ శ్రేణి ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో 230కిమీలుగా పరిధిని అందిస్తుంది. 

ఎంజీ కామెట్ ధరలు ఇలా

  • ఎగ్జిక్యూటివ్- రూ. 6.99 లక్షలు
  • ఎక్సైట్ – రూ. 7.98 లక్షలు
  • ఎక్సైట్ ఎఫ్‌సీ – రూ. 8.45 లక్షలు
  • ఎంజీ కామెట్ స్పెషల్ – రూ. 9 లక్షలు
  • స్పెషల్ ఎఫ్‌సీ – రూ. 9.37 లక్షలు

ఎంజీ కామెట్ ఈవీ ఫీచర్ల విషయానికి వస్తే శక్తివంతమైన పంచ్‌ను ప్యాక్ చేస్తుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు, ముందు వైపున ఒక ప్రకాశవంతమైన ఎంజీ లోగోతో పాటు ముందు, వెనుక కనెక్టింగ్ లైట్లు ఉన్నాయి. క్యాబిన్ లోపల మీరు లెదర్‌తో వచ్చే స్టీరింగ్ వీల్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, టూ-స్పోక్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లతో అందరినీ ఆకర్షిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ