AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian railways: సాధారణ ప్రయాణికులకు భారీ ఊరట.. భారత రైల్వే కీలక నిర్ణయం

దేశంలోని రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 లో పదివేల నాన్ ఏసీ కోచ్ లను ఉత్పత్తి చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనుంది. కాలానుగుణంగా పెరుగుతున్న అవసరాలు, ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త కోచ్ లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయి.

Indian railways: సాధారణ ప్రయాణికులకు భారీ ఊరట.. భారత రైల్వే కీలక నిర్ణయం
Indian Railways
Madhu
|

Updated on: Jul 06, 2024 | 7:26 PM

Share

దేశంలోని రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 లో పదివేల నాన్ ఏసీ కోచ్ లను ఉత్పత్తి చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనుంది. కాలానుగుణంగా పెరుగుతున్న అవసరాలు, ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త కోచ్ లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయి. అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సౌకర్యాలు కలుగుతాయి.

ప్రధాన ప్రయాణ సాధనం..

దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఆధారపడిన ప్రధాన ప్రయాణం సాధనం రైలు. దీని ద్వారా తక్కువ ఖర్చుతో దేశంలోని నలుమూలలకు రాకపోకలు సాగించవచ్చు. మిగిలిన రవాణా సాధనాలైన బస్సు తదితర వాటితో పోల్చితే వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేష్లన్ల ఎల్లప్పుడూ ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉంటాయి. రిజర్వేషన్ బోగీలను పక్కన పడితే సాధారణ బోగిలలో నిలబడటానికి కూడా ఖాళీ ఉండదు.

విపరీతమైన రద్దీ..

ప్రస్తుతం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లలో బోగీలు ఉండడం లేదనేది వాస్తవం. రిజర్వేషన్ చేయించుకుని ప్రయాణించే వారికి ఇబ్బందులు లేకపోయినా.. సాధారణ బోగీలలో ప్రయాణికులు మాత్రం అవస్థలు పడుతున్నారు. కనీసం నిలబడటానికి కూడా ఖాళీ లేని విధంగా ప్రయాణం సాగిస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బోగీలు లేకపోవడమే దీనికి కారణం. ఒక్కోసారి జనరల్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు రిజర్వేషన్ బోగీలలో ఎక్కేస్తున్నారు. దీని వల్ల రిజర్వేషన్ టికెట్లు తీసుకున్నవారికీ ఇబ్బందులు తప్పడం లేదు.

రాబోయే రెండేళ్లలో..

భారతీయ రైల్వే రానున్న రెండేళ్లలో సుమారు పదివేల నాన్ ఎయిర్ కండీషన్ కోచ్ లను ఉత్పత్తి చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించే ముఖ్యమైన చర్యగా భావించవచ్చు. రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సేవలందించడం, ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించడం, వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపర్చడమే దీని ప్రధాన లక్ష్యం.

ఉత్పత్తి ప్రణాళిక..

2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలలో రికార్డు స్థాయిలో 5,300 సాధారణ కోచ్ లను తయారు చేయాలని రైల్వే అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 2024-25లో 2605 బోగీలు సిద్దం కానున్నాయి. వీటిలో అమృత్ భారత్ 1,470 నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లు, 323 ఎస్ఎల్ఆర్ కోచ్‌లు, 32 అధిక కెపాసిటీ పార్శిల్ వ్యాన్లు, 55 ప్యాంట్రీ కార్లు ఉన్నాయి. ఇక 2025-26లో అమృత్ భారత్ 2,710 జనరల్ కోచ్‌లు, 1,910 నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లు, 514 ఎస్ఎల్ఆర్ కోచ్‌లు, 200 అధిక కెపాసిటీ పార్శిల్ వ్యాన్లు, 110 ప్యాంట్రీ కార్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

అభినందనలు..

దేశంలో పెరిగిన జనాభాతో పాటు ఉద్యోగ, వ్యాపారాల రీత్యా రాకపోకలు సాగించే వారి రద్దీ నేపథ్యంలో రైళ్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలు తీర్చడం కోసం రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోచ్ ల ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!