Indian Railway: రవాణా వ్యవస్థలో అతిపెద్దది భారతీయ రైల్వేశాఖ. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎప్పటికప్పుడు సదుపాయాలను మెరుగు పరుస్తుంటుంది. రైల్వే స్టేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ ప్రయాణికులకు అవసరమైన పనులను చేపడుతూ ఉంటుంది. ఇక తాజాగా దేశంలోని 11 రైల్వే స్టేషన్‌ల అప్‌గ్రేడ్ పనులకు రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రైల్వే బోర్డు అన్ని జోన్ రైల్వేల జనరల్ మేనేజర్‌లకు లేఖ రాసింది. 21 స్టేషన్‌ల జాబితా, వాటి ఎగ్జిక్యూటింగ్ ఏజన్సీకి కొనసాగింపు, మరో 11 స్టేషన్‌ల కోసం ఎగ్జిక్యూటింగ్ ఏజన్సీల జాబితాను లేఖలో పొందుపర్చింది. అయితే వీటి మాస్టర్ ప్లాన్స్‌ను రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి పొందవచ్చని తెలిపింది.
11 రైల్వే స్టేషన్‌ల అప్‌గ్రేడ్ పనుల జాబితా
1. ఛండీగఢ్
2. లుధియానా
3. సికింద్రాబాద్
4. గ్వాలియర్
5. అసన్సోల్
6. ఎర్నాకులం టౌన్
7. ముజఫర్‌పూర్
8. సోమనాథ్
9. కాట్పాడి
10. జమ్మూతావి
11. ఫరీదాబాద్
ఇవి కూడా చదవండి: