Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై వాట్సాప్‌లో ఫుడ్‌ ఆర్డర్ చేసుకోవచ్చు.

|

Feb 06, 2023 | 5:46 PM

భారతీయ రైల్వే ముఖ చిత్రం మారుతోంది. రైల్వేల ఆధునీకరణతో పాటు వందే భారత్‌ రైళ్లతో రైల్వేకు కొత్త హంగులు దిద్దుతోన్న భారత రైల్వే ఇటీవల మరో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైలు ప్రయాణం చేసే సమయంలో..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై వాట్సాప్‌లో ఫుడ్‌ ఆర్డర్ చేసుకోవచ్చు.
Indian Railways
Follow us on

భారతీయ రైల్వే ముఖ చిత్రం మారుతోంది. రైల్వేల ఆధునీకరణతో పాటు వందే భారత్‌ రైళ్లతో రైల్వేకు కొత్త హంగులు దిద్దుతోన్న భారత రైల్వే ఇటీవల మరో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైలు ప్రయాణం చేసే సమయంలో ఫుడ్‌ ఆర్డర్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫుడ్ ఆన్ ట్రాక్ కోసం ఈ -కేటరింగ్ యాప్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ -కేటరింగ్ సేవలను అందించడమే లక్ష్యంగా ఇండియన్‌ రైల్వేస్‌ మరో అడుగు ముందుకేసింది.

రైల్వే ప్రయాణికులకు ఈ -కేటరింగ్ విధానం ద్వారా ఇకపై వాట్సాప్‌ను ఉపయోగించి ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఇందుకోసం వాట్సాప్ నంబర్ +91-8750001323ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ రెండు విధానాలను తీసుకొచ్చింది. మొదటి విధానంలో రైలులో ప్రయాణం చేస్తున్న వారికి వాట్సాప్‌ బిజినెస్‌ నెంబర్ ద్వారా ఈ-క్యాటరింగ్ సేవలను పొందేందుకు మెసేజ్‌ రూపంలో ఈ-టికెట్ పంపిస్తారు. దీని ద్వారా ప్రయాణికులు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే అవసరం లేకుండా నేరుగా వెబ్‌సైట్‌ ద్వారా ఫుడ్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

ఇక మరో విధానంలో వాట్సాప్‌ నెంబర్‌ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన చాట్‌ బాక్స్‌తో సంభాషించి ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఈ క్యాటరింగ్ విధానాన్ని మొదట ఎంపిక చేసిన కొన్ని రైళ్లలో అమలు చేయనున్నారు. అనంతరం కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మిగతా రైళ్లలోనూ అమలు చేయనున్నారు. ఈ సేవలను ప్రారంభించిన తొలి రోజే ఐఆర్‌సీటీసీకి చెందిన ఈ-క్యాటరింగ్‌, యాప్‌ ద్వారా సుమారు 50000 ఫుడ్‌ ఆర్డర్స్‌ జరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..