AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan: మీకు ఫోన్‌పే యాప్‌ ఉందా.? అయితే ఇట్టే రూ. 5 లక్షలు లోన్‌ పొందే అవకాశం..

ఇంటర్‌టెన్‌ వినియోగం పెరగడంతో అన్ని పనులకు ఒక్కో యాప్‌ పుట్టుకొచ్చింది. మరీ ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్‌ వచ్చిన తర్వాత ఈ వ్యాలెట్స్‌ వినియోగం బాగా పెరిగింది. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు...

Loan: మీకు ఫోన్‌పే యాప్‌ ఉందా.? అయితే ఇట్టే రూ. 5 లక్షలు లోన్‌ పొందే అవకాశం..
Loan
Narender Vaitla
|

Updated on: Feb 06, 2023 | 4:28 PM

Share

ఇంటర్‌టెన్‌ వినియోగం పెరగడంతో అన్ని పనులకు ఒక్కో యాప్‌ పుట్టుకొచ్చింది. మరీ ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్‌ వచ్చిన తర్వాత ఈ వ్యాలెట్స్‌ వినియోగం బాగా పెరిగింది. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని చేసే పరిస్థితి వచ్చేసింది. కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా పేమెంట్‌ యాప్స్‌ సైతం ఎన్నో ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్నాయి. లోన్‌లకు కూడా రకరకాల యాప్‌లు పుట్టుకొచ్చాయి. ప్రముఖ బ్యాంకులు కూడా యాప్‌ ద్వారా లోన్‌లను అందిస్తున్నాయి.

అయితే ఇటీవల కొన్ని లోన్‌ యాప్స్‌ ప్రజలను పీడించుకుని తింటున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఊరు పేరు లేని యాప్స్‌, ఇష్టారాజ్యంగా వడ్డీ వసూలు చేస్తూ యూజర్లను పీక్కుతింటున్నాయి. అయితే కొన్ని నమ్మకమైన లోన్‌ యాప్స్‌ మాత్రం సరైన ఇంట్రెస్ట్‌ రేట్స్‌కి లోన్‌లు అందిస్తూ అవసరానికి డబ్బులు లభించేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌లో మంచి ప్రాచుర్యం సంపాదించుకున్న ఫోన్‌పే కూడా లోన్‌లను అందిస్తోంది.

అయితే ఈ యాప్‌ నేరుగా కాకుండా పలు ఫిన్‌టెక్‌ సంస్థల ద్వారా లోన్‌లను అందిస్తోంది. మనీ వ్యూ, బడ్డీ లోన్స్‌ కంపెనీల ద్వారా యూజర్లకు లోన్‌లు అందిస్తోంది ఫోన్‌పే. సిబిల్‌ స్కోర్ ఆధారంగా గరిష్టంగా రూ. 5 లక్షల వరకు ఇన్‌స్టంట్‌ లోన్‌ను అందిస్తోంది. ఫోన్‌పే ఈ సంస్థను ప్రమోటం చేస్తుండడంతో యూజర్లలో సైతం నమ్మకం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ముందుగా ఫోన్‌ పే యాప్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం కింద స్పాన్సర్‌ లింక్‌లో కనిపించే మనీ వ్యూ లేదా బడ్డీ లోన్‌లను సెలక్ట్‌ చేసుకోవాలి. వెంటనే వాటి వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. సంస్థ పేర్కొన్న సమాచారాన్ని అందించడం ద్వారా లోన్‌ పొందొచ్చు.

నోట్‌: ఆన్‌లైన్‌లో లోన్‌ తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వడ్డీ రేటు ఎంత పడుతోంది, ఎన్ని నెలల్లో ఎంత చెల్లించాలి. లాంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే లోన్‌ కోసం అప్లై చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో