AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఏయే పరిస్థితుల్లో ట్రైన్ చైన్ లాగొచ్చు..? ఈ కారణాలు లేకుండా లాగితే ఏడాది జైల్లోనే..

ట్రైన్‌లో అత్యవసర పరిస్థితుల సమయంలో చైన్ లాగడం వల్ల రైలు ఆగిపోతుంది. అయితే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే చైన్ లాగాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా చైన్ లాగితే జైలుశిక్ష విధిస్తారు. అంతేాకాదు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. ఏయే పరిస్థితుల్లో చైన్ లాగవచ్చనేది తెలుసుకుందాం.

Indian Railways: ఏయే పరిస్థితుల్లో ట్రైన్ చైన్ లాగొచ్చు..? ఈ కారణాలు లేకుండా లాగితే ఏడాది జైల్లోనే..
Train Chain
Venkatrao Lella
|

Updated on: Oct 27, 2026 | 12:37 PM

Share

జీవితంలో ఇప్పటివరకు ప్రతీఒక్కరూ ఒక్కసారైనా రైలు ప్రయాణం చేసి ఉంటారు. దేశంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉంది. ప్రపంచంలోన అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా రైళ్ల ద్వారా సులువుగా చేరుకునే సౌలభ్యం ఉంది. దేశంలో రైల్వే వ్యవస్థ రోజురోజుకు అప్‌గ్రేడ్ అవుతూ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందిస్తోంది. ఇప్పటికే వందే భారత్, వందే భారత్ స్లీపర్ లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి రాగా.. వచ్చే ఏడాది ఆగస్ట్‌ నుంచి బుల్లెట్ రైళ్లు కూడా పరుగులు పెట్టనున్నాయి. హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల రాకతో ఒక నగరం నుంచి మరో నగరానికి గంటలోనే చేరుకోవచ్చు.

అయితే రైళ్లల్లో అత్యవసర పరిస్థితుల కోసం రైళ్లల్లో అనేక భద్రతా వ్యవస్థలు ఉంటాయి. వాటిల్లో చైన్ సదుపాయం ఒకటి. ఏదైనా అత్యవసరమైనప్పుడు ప్రతీ కోచ్‌లో అందుబాటులో ఉండే చైన్ లాగడం వల్ల ట్రైన్ ఆగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే చైన్ లాగాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా లాగితే రైల్వే అధికారులు భారీగా జరిమానా విధిస్తారు. ఏయే పరిస్థితుల్లో చైన్ లాగాలనే దానిపై రైల్వేశాఖ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది.

ఈ సమయాల్లో మాత్రమే చైన్ లాగొచ్చు..

-రైల్లో మంటలు చెలరేగడం లేక ఏదైనా ప్రమాదం చోటుచేసుకోవడం -వృద్దులు, వికలాంగులు, గర్బిణీలు, పిల్లలు ట్రైన్ కదులుతున్న సమయంలో బయట ఉండి రైలు ఎక్కలేని పరిస్థితి ఉన్నప్పుడు చైన్ లాగవచ్చు. -ట్రైన్ ప్రయాణంలో ఎవరైనా ప్రయాణికులు అనారోగ్యానికి గురై చైన్ లాగవచ్చు -ట్రైన్‌లో ఏదైనా దొంగతనం, దోపిడీ, దొంగలు చొరబడ్డా చైన్ అలారం గొలుసు లాగవచ్చు

కారణం లేకుండా లాగితే జరిమానా ఎంత..?

సరైన కారణాలు లేకుండా చిన్నపాటి విషయాలకు చైన్ లాగితే కఠిన శిక్షలు తప్పవు. రైల్వే చట్టాలను అతిక్రమించి ప్రయాణికులతో పాటు రైల్వే వ్యవస్థకు భంగం కలిగించినందుకు భారీగా జరిమానా విధించడంతో పాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశముంటుంది. అవనసరంగా ట్రైన్ లాగడం వల్ల ఈ రూట్లో వచ్చే మిగతా రైళ్లు కూడా ఆలస్యమవుతాయి. దీని వల్ల సరైన కారణం లేకుండా చైన్ లాగేవారికి రైల్వే చట్టం-1989 సెక్షన్ 141 ప్రకారం రూ.వెయ్యి జరిమానా లేదా ఒక ఏడాది జైలుశిక్ష విధిస్తారు. కొన్నిసార్లు రెండూ శిక్షలు విధించే అవకాశముంది. చైన్ లాగగానే సిబ్బందికి మీ కోచ్‌లో చైన్ లాగాలనేది తెలుస్తుంది. దీంతో మీ కోచ్ వద్దకే వెంటనే వచ్చేస్తారు. కారణం ఏంటనేది తెలుసుకుంటారు. సరైన కారణం లేకపోతే చైన్ లాగిన వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.

Follow Us