AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పండక్కి ముందే రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు.. మీ అకౌంట్లో పడతాయా..? లేదా? ఒకే క్లిక్‌తో చెక్ చేస్కోండి..

రైతులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. దేశంలోని అన్నదాతలకు పీఎం కిసాన్ నిధులను జమ చేయనుంది. అక్టోబర్ 30న విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు అయింది. అయతే రైతులు సులువుగా తమకు అకౌంట్లో డబ్బులు పడతాయా.. లేదా అనేది తెలుసుకోవచ్చు.

PM Kisan: పండక్కి ముందే రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు.. మీ అకౌంట్లో పడతాయా..? లేదా? ఒకే క్లిక్‌తో చెక్ చేస్కోండి..
Pm Kisan
Venkatrao Lella
|

Updated on: Oct 27, 2026 | 7:15 AM

Share

పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్. దీపావళి పండక్కి ముందే దేశంలోని అన్నదాతల అకౌంట్లో నిధులు జమ కానున్నాయి. పీఎం కిసాన్ 24వ విడత నిధులను అక్టోబర్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్‌లోని బనస్కాంతలో జరగనున్న కార్యక్రమంలో మోదీ తన చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. దీంతో ఆ రోజే రైతుల బ్యాంక్ అకౌంట్లలో రూ.2 వేలు జమ కానున్నాయి. దీపావళి పండక్కి ముందే అకౌంట్లలో డబ్బులు విడుదల కానుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవైసీ పూర్తి చేయకపోవడం, ల్యాండ్ రికార్డులలో తప్పులు, బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేసుకోకపోవడం వంటి కారణాలతో పీఎం కిసాన్ నిధులు నిలిచిపోవచ్చు. మరో మూడు రోజుల్లో నిధులు రానున్న క్రమంలో రైతులు తమకు డబ్బులు పడతాయో.. లేదో అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఇదెలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎం కిసాన్ డబ్బులు పడతాయో.. లేదో తెలుసుకోండిలా..

-పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి

-హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ విభాగానికి వెళ్లండి

-అక్కడ నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకోండి

-అక్కడ మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి

-పీఎం కిసాన్ డేటాబేస్‌లో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయండి

-అనంతరం సబ్మిట్‌పై క్లిక్ చేయండి

-కేవైసీ, ల్యాండ్ రికార్డులు, బ్యాంక్ సీడింగ్ వంటి ప్రక్రియలో ఏమైనా లోపాలు ఉంటే అక్కడ తెలుస్తుంది

-అలాగే 24వ విడత ఇన్‌స్టాల్‌మెంట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే మీకు నిధులు పడతాయా.. లేదా అనే స్టేటస్ కనిపిస్తుంది

ఫిర్యాదు చేయడం ఎలా..?

పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే రైతులు సులువుగా ఫిర్యాదు చేయవచ్చు. కిసాన్ హెల్ప్ లైన్ సెంటర్ 18001801551 లేదా 155261 నెంబర్లను సంప్రదించి సహాయం పొందవచ్చు. భారత్ విస్తార్ యాప్ డౌన్‌లోడ్ చేసి భారతీ అనే చాట్‌బాట్ ద్వారా మీ కిసాన్‌కు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. పీఎం కిసాన్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? సాంకేతిక సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. కొత్తగా ఈ సేవను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆధార్ బేస్డ్ ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని రైతులకు అలర్ట్ జారీ చేసింది. కేవైసీ పూర్తి చేయకపోతే డబ్బులు నిలిచిపోతాయని హెచ్చరించింది.

Follow Us