Indian Railways: రైళ్లో ప్రయణిస్తున్నారా.? అయితే మీకు ఈ నిబంధనలు తెలుసేమో చెక్ చేసుకోండి.
దేశంలో అత్యధిక మంది ఉపయోగించే రవాణా సాధానాల్లో రైల్వే మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ రోజూ లక్షలాది మందిని గమ్య స్థానాలకు చేరుస్తుంటాయి. ఇదిలా ఉంటే రైల్వేలో ప్రయాణించే వారు కొన్ని నిబంధనలు పాటించాలి..
దేశంలో అత్యధిక మంది ఉపయోగించే రవాణా సాధానాల్లో రైల్వే మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ రోజూ లక్షలాది మందిని గమ్య స్థానాలకు చేరుస్తుంటాయి. ఇదిలా ఉంటే రైల్వేలో ప్రయాణించే వారు కొన్ని నిబంధనలు పాటించాలి మీలో ఎంత మందికి తెలుసు. ముఖ్యంగా తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే కొన్ని నియమనిబంధనలను రూపొందించింది. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటంటే..
* రాత్రి 10.00 గంటల తర్వాత ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ ప్రయాణికుల రైలు టికెట్లను తనిఖీ చేయకూడదు. రాత్రి 10.00 గంటల తర్వాత రైలు ఎక్కినవారికి మాత్రం ఈ నిబంధన వర్తించదు. టీటీఈ వీరి టికెట్లను చెక్ చేయవచ్చు.
* ఇక మిడిల్ బెర్త్‌లో ప్రయాణించే వారు రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు ఆ బెర్త్ ను ఉపయోగించుకోవచ్చు.
* ఎవరైనా ప్రయాణికులు ట్రైన్ మిస్ అయితే. వారు రిజర్వ్ చేసుకున్న సీట్లను టీటీఈ ఇతరులకు కేటాయించవచ్చు. అయితే రైలు కదిలిన కనీసం గంట లేదా రెండు స్టేషన్లు దాటిన తర్వాత బెర్త్‌లను వేరే వారికి కేటాయించవచ్చు.
* ఇక రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో పక్కవారికి ఇబ్బంది అయ్యేలా ఫోన్‌లో పెద్దగా మాట్లాడకూడదు. ఎక్కవ సౌండ్‌తో పాటలు ప్లే చేయకూడదు. ప్రయాణం సమయంలో ఎక్కువ సౌండ్‌తో పాటలు పెడుతున్నారని ఫిర్యాదులు రావడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
* రాత్రి 10 గంటల తర్వాత లైట్లను ఆఫ్ చేయాలి. రాత్రుళ్లు లైట్ ఆన్ చేసిన ఇతర ప్రయాణికుల నిద్రకు ఆటంకం కలిగించకూడదని దీని ఉద్దేశం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..