Media And Entertainment: మీడియా, వినోద రంగంలో వృద్ధికి చాన్స్‌.. 2026 నాటికి రూ.4.30 లక్షల కోట్లకు చేరే అవకాశం..

భారతీయ మీడియా, వినోద పరిశ్రమ రాబోయే కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ PwC తన నివేదికలో వెల్లడించింది. 2026 నాటికి మీడియా, వినోద రంగ పరిమాణం రూ.4.30 లక్షల కోట్లుగా అంచనా వేసింది...

Media And Entertainment: మీడియా, వినోద రంగంలో వృద్ధికి చాన్స్‌.. 2026 నాటికి రూ.4.30 లక్షల కోట్లకు చేరే అవకాశం..
Digital Media
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 25, 2022 | 12:51 PM

భారతీయ మీడియా, వినోద పరిశ్రమ రాబోయే కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ PwC తన నివేదికలో వెల్లడించింది. 2026 నాటికి మీడియా, వినోద రంగ పరిమాణం రూ.4.30 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఈ సమయంలో ఈ రంగంలో 8.8 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR) ఉంటుందని అంచనా వేసింది. దేశీయ మార్కెట్‌లో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్‌ల వ్యాప్తి పెరుగుతున్నందున ఈ రంగానికి మద్దతు లభిస్తుందని నివేదిక పేర్కొంది. సాంప్రదాయ మీడియా వృద్ధి కూడా కొనసాగుతుందని తెలిపింది. దేశీయ టీవీ ప్రకటనలు 2026 నాటికి 43 వేల కోట్ల రూపాయలకు చేరుకుంటాయని, ఈ సంఖ్య సహాయంతో భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద టీవీ ప్రకటనల మార్కెట్‌గా అవతరిస్తుందని పేర్కొంది. ఈ రంగంలో భారత్ కంటే అమెరికా, జపాన్, చైనా, బ్రిటన్ మాత్రమే ముందున్నాయని పేర్కొంది.

PwC నివేదిక గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా ఔట్‌లుక్ 2022-2026 ప్రకారం, భారతీయ మీడియా, వినోద రంగం 2022లో 11.4 శాతం వృద్ధితో దాదాపు రూ. 3.14 లక్షల కోట్ల టర్నోవర్‌ను ఆర్జించే అవకాశం ఉందని వివరించింది. ఇది కాకుండా భారతదేశ OTT వీడియో సేవల రంగం రాబోయే నాలుగేళ్లలో రూ. 21,031 కోట్ల వ్యాపారం చేస్తుందని అంచనా. ఇందులో రూ. 19,973 కోట్ల వ్యాపారం సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సేవలు, రూ. 1,058 కోట్ల వ్యాపారం వీడియో ఆన్ డిమాండ్ సేవల ద్వారా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. టీవీ ప్రకటనల రంగం 2022లో రూ.35,270 కోట్ల నుంచి 2026లో రూ.43,568 కోట్లకు పెరుగుతుందని, 23.52 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుందని నివేదిక పేర్కొంది. ఇది కాకుండా భారతదేశం ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ మార్కెట్ కూడా 12.1 శాతం CAGR వద్ద వృద్ధి చెంది 2026 నాటికి రూ. 28,234 కోట్లకు చేరుకుంటుందని చెప్పింది. అదే సమయంలో సంగీతం, రేడియో, పోడ్‌కాస్ట్ సెగ్మెంట్ 2021 సంవత్సరంలో 18 శాతం పెరిగింది. 5G రాకతో పరిస్థితి మరింత మారుతుందని నివేదికలో పేర్కొంది.