Market News: వారాలు మారుతున్నా వదలని వార్ భయాలు.. భారీ నష్టాలతో ఎరుపెక్కిన భారత మార్కెట్లు..

|

Mar 07, 2022 | 9:50 AM

Market News: దేశీయ స్టాక్ మార్కెట్లు వారం ప్రారంభంలో తీవ్ర ఒత్తిడిలో మెుదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ సూచీ 1200 పాయింట్లు కోల్పోయింది. ఆరంభమైన నిమిషాల వ్యవధిలోనే గరిష్ఠంగా సూచీ 1450కి పైగా పాయింట్లను కోల్పోయింది.

Market News: వారాలు మారుతున్నా వదలని వార్ భయాలు.. భారీ నష్టాలతో ఎరుపెక్కిన భారత మార్కెట్లు..
Stock Market
Follow us on

Market News: దేశీయ స్టాక్ మార్కెట్లు వారం ప్రారంభంలో తీవ్ర ఒత్తిడిలో(Markets in volatile) మెుదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ సూచీ 1200 పాయింట్లు కోల్పోయింది. ఆరంభమైన నిమిషాల వ్యవధిలోనే గరిష్ఠంగా సూచీ 1650కి పైగా పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో మరో సూచీ నిఫ్టీ-50 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం ఎస్జీఎక్స్ నిఫ్టీ(SGX Nifty) సైతం భారీ గ్యాప్ డౌన్ లో ఓపెన్ కావటం మార్కెట్ సెంటిమెంట్లను నెగటివ్ గా ఇంపాక్ట్ చేసిందని చెప్పుకోవాలి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ రేట్ల(GST Slab Rates)లో మార్పులు చేయనున్నట్లు వార్తలు రావటంతో మార్కెట్లు మరింత ఒత్తిడికి లోనయ్యారు. మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, ఎషియన్ పెయింట్స్, ఐచర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నిఫ్టీ సూచీలో నష్టాలను నమోదు చేశాయి. ఇదే సమయంలో ఓఎన్జీసీ, కోల్ ఇండియా, హిందాల్కో, టాటా స్టీల్ షేర్ల ధరలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ప్రధాన సూచీలైన బ్యాంక్ నిఫ్టీ 1500 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 540 పాయింట్లకు పైగా నష్టపోయాయి. రోజులు గడుస్తున్నప్పటికీ యుద్ధ భయాలు మాత్రం మార్కెట్లను వదలడం లేదు. ఇవి ఎప్పటికి సాధారణ స్ధితికి వస్తాయి అనే అంశంలపై నిపుణులు సైతం సరైన అంచనాకు రాలేక పోతున్నారు. దీనికి తోడు విదేశీ మదుపరులు తమ సొమ్మును దేశం నుంచి భారీగా తరలించటం, చమురు ధరలు ఆకాశాన్ని తాకటంతో పాటు బంగారం ధరలు అమాంతం పెరగటం మార్కెట్ల పై నెగెటివ్ సెంటిమెంట్ ను పెంచుతోంది. మదుపరుల్లోనూ భయాలు పెరగటంతో వారు ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకునే పనిలో ఉన్నారు. రష్యా ఉక్రెయిన్ వివాదం రోజు రోజుకూ ముదరటం కూడా దేశీయ మార్కెట్ల గమనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని మార్కెట్  వర్గాలు అంటున్నాయి.

ఇవీ చదవండి..

WhatsApp: ఇక నుంచి అన్ని డాక్యుమెంట్లు వాట్సాప్ లోనే.. ఎందుకో తెలుసా..?

ITC Stock: ఐటీసీ ఇన్వెస్టర్లకు గోల్డెన్ డేస్.. కంపెనీ తాజా రిటర్న్స్ విశ్లేషణ మీకోసం..

Multibagger Stock: వారెవ్వా ఏమి స్టాక్.. ఇన్వెస్టర్లకు కనకవర్షం.. రూ.1.22 లక్షల పెట్టుబడిని రూ. 88 లక్షలుగా మార్చేసింది..