AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success story: 16 ఏళ్లకే వంద కోట్ల కంపెనీకి అధిపతి.. ఈ బాలిక విజయం స్ఫూర్తిదాయకం

సాధారణంగా 16 ఏళ్ల వయసున్న పిల్లలు పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్ మొదటి ఏడాది చదువుతూ ఉంటారు. లేకపోతే పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరతారు. రోజూ కాలేజీకి వెళ్లి, ఇంటికి వచ్చిన తర్వాత తమ తల్లిదండ్రులకు సహాయం చేస్తుంటారు. చదువు పూర్తయిన తర్వాత మంచి కంపెనీలో ఉద్యోగం సాధించాలని, ఉన్నత స్థానానికి ఎదగాలని కలలు కంటూ ఉంటారు. కానీ అదే వయసున్న ఓ బాలిక వంద కోట్ల రూపాయల కంపెనీని నిర్మించింది.

Success story: 16 ఏళ్లకే వంద కోట్ల కంపెనీకి అధిపతి.. ఈ  బాలిక విజయం స్ఫూర్తిదాయకం
Pranjali Awasthi
Nikhil
|

Updated on: Jun 20, 2025 | 2:00 PM

Share

ప్రతిభ ఉంటే చాలు.. వయసుతో సంబంధం లేకుండా విజయం సాధించవచ్చు అనడానికి నిదర్శనంగా నిలిచింది. ఆ బాలికే భారత సంతతికి చెందిన అమెరికా యువత అంజలి అవస్థి. స్టార్టప్ ల ప్రపంచంలో ఆమె సాధించిన విజయం, ఇతర వివరాలను తెలుసుకుందాం. అంజలి అవస్థ చిన్నప్పటి నుంచే చాలా తెలివైన విద్యార్థి. ఆమెకు కోడింగ్ అంటే చాలా ఇష్టం. తండ్రి కూడా కంప్యూటర్ ఇంజినీర్ కావడంతో ఏడేళ్ల వయసు నుంచే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ప్రారంభించింది. వయసుతో పాటు టెక్నాలజీపై ఆసక్తి, మక్కువ ఎక్కువవుతూ వచ్చాయి. కాగా.. అంజలికి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. దీంతో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం దొరికింది. అలా ఫ్లోరిడాలో కంప్యూటర్ సైన్స్, గణిత కోర్సులను అభ్యసించింది.

అంజలి 2022లో ఏఐ స్టార్టప్ అయిన డెల్వ్.ఏఐ అనే కంపెనీని ప్రారంభించింది. చిన్న వయసులోనే దానికి సీఈవోగా వ్యవహరించింది. విద్యావనరుల నుంచి డేటా వెలికితీత తదితర విషయాల్లో పరిశోధకులకు ఈ కంపెనీ సాయం చేస్తుంది. అలా టెక్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకోవడంతో పాటు విజయపథంలో పయనించింది. ఇప్పుడు ఆ కంపెనీ విలువ 12 మిలియన్ల యూఎస్ డాలర్లకు చేరింది.

అంజలి జీవితాన్ని ఇంటర్న్ షిప్ మలుపు తప్పిందని చెప్పవచ్చు. ఆమె 13వ ఏళ్ల వయసులో ఫ్లోరిడాలోని ఇంటర్నేషనల్ యూనివర్సిటీలోని మెషిన్ లెర్నింగ్ ల్యాబ్ లో తన మొదటి ఇంటర్న్ షిప్ ను ప్రారంభించింది. వివిధ రకాల ప్రాజెక్టుల్లో పనిచేసింది. ఏఐ పనితీరు, మెషిన్ లెర్నింగ్ ఆమెను విపరీతంగా ఆకర్షించాయి. ముఖ్యంగా ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ 3 వెర్షన్ ను విడుదల చేసినప్పుడు అమెకు ఒక అవకాశం కనిపించింది. పరిశోధనలను జనరేటివ్ ఏఐ వేగవంతం చేయగలదని గ్రహించింది. ఈ ఆలోచనే అంజలి జీవితాన్ని మార్చివేసింది.

ఇవి కూడా చదవండి

డెల్వ్.ఏఐ కంపెనీ ద్వారా అంజలి తన కలలను నిజయం చేసుకుంది. టెక్ ప్రపంచంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. పరిశోధకులకు సమయాన్ని ఆదాయం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కంపెనీలోని పదిమంది వ్యక్తులకు అంజలి నాయకత్వం వహిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి