AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Bikes: వాహనదారులను కలవరపెడుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు.. ఆ రెండు ఘటనలపై దర్యాప్తు..!

Electric Bikes: ప్రభుత్వాలేమో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ వాడాలని చెబుతున్నాయి. కానీ, కారణాలేమైనా చాలాచోట్ల అవి కాలి బూడిదవుతున్నాయి. అంతేనా ప్రాణాలు తీస్తున్నాయి. దీంతో కీలక నిర్ణయం..

Electric Bikes: వాహనదారులను కలవరపెడుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు.. ఆ రెండు ఘటనలపై దర్యాప్తు..!
Subhash Goud
| Edited By: |

Updated on: May 07, 2024 | 12:07 PM

Share

Electric Bikes: ప్రభుత్వాలేమో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ వాడాలని చెబుతున్నాయి. కానీ, కారణాలేమైనా చాలాచోట్ల అవి కాలి బూడిదవుతున్నాయి. అంతేనా ప్రాణాలు తీస్తున్నాయి. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కాలుష్యం తగ్గించడానికి, పెట్రోల్‌, డీజిల్‌ యూసేజ్ పెరగకుండా, ఎలక్ట్రిక్‌ వాహనాల  వైపు మొగ్గు చూపుతోంది కేంద్ర ప్రభుత్వం (Central Government). వీటి తయారీదారులకు, వినియోగదారులకు రాయితీలు కూడా ఇస్తూ ప్రోత్సహిస్తోంది. కానీ, ఇటీవల మహారాష్ట్ర, తమిళనాడులో జరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric scooter) అగ్నిప్రమాదం కలవరపెడుతోంది. దీంతో దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఓలా, ఒకినావా ఎలక్ట్రిక్ బైక్‌ (Electric Bikes)లకు మంటలు అంటుకున్న రెండు సంఘటనలపై దర్యాప్తు చేయడానికి, స్వతంత్ర నిపుణుల బృందాన్ని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం పూణే నగరంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఎస్‌ 1ప్రో బైకు అగ్నికి ఆహుతి అయింది. స్కూటరు నుంచి ఉన్నట్టుండి పొగలు రావడంతో, క్షణాల్లోనే కాలి బూడిదైంది. అక్కడున్న వారు ఈ ఇన్సిడెంట్‌ను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

అది వైరల్‌ కావడంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఇక తమిళనాడులోని వెల్లూర్‌లో అయితే, విషాదం జరిగింది. ఏకంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఛార్జింగ్‌ పెట్టిన ఎలక్ట్రిక్‌ బైకు మంటల్లో చిక్కుకోవడం కారణంగా ఇద్దరు మరణించారు. దురైవర్మ అనే ఫోటోగ్రాఫర్‌ ఇటీవలే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొని, ఇంట్లో రాత్రిపూట ఛార్జింగ్‌ పెట్టి పడుకున్నాడు. కానీ, షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా స్కూటర్‌కు మంటలు అంటున్నాయి. ఇళ్లంతా పొగ వ్యాపించడంతో దురైవర్మ, అతని కూతురు ప్రీతీ మోహాన ఇద్దరు నిద్రలోనే చనిపోయారు. ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురయ్యారు వినియోగదారులు. ఈవీలకు మంటలు అంటుకున్న కేసులను స్వతంత్ర నిపుణుల బృందం దర్యాప్తు చేయాలని ఆదేశించింది కేంద్రం. దర్యాప్తు చేయడానికి వెల్లూరు, పూణేకు వెళ్లనుంది నిపుణుల బృందం.

ఇవి కూడా చదవండి:

Financial Alert: అలర్ట్‌.. మిగిలింది రెండే రోజులు.. ఈ పనులు పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందులే..!

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!